Atchannaidu: వాలంటీర్లపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు.. ప్రభుత్వ నియమ నిబంధనలు, ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వాలంటీర్లపై శ్రీ కాళహస్తి టీడీపీ అభ్యర్ధి బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో.. బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇక, అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను కొనసాగించడంతో పాటు వారికి మెరుగైన సదుపాయాలు, జీతభత్యాలు కల్పిస్తామని గతంలోనే తమ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారని గుర్తించారు. కానీ, ప్రజా ప్రయోజన కార్యక్రమాలను గాలికి వదిలేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాచకం చేస్తున్న వాలంటీర్లను మాత్రం సమర్థించేది లేదన్నారు. ఇప్పటికే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి.. చట్ట వ్యతిరేకత కార్యక్రమాల్లో పాల్గొన్న 200 మందికి పైగా వాలంటీర్లు సస్పెండ్ అయ్యారని పేర్కొన్నర ఆయన.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టారు.. వారి భవిష్యత్‌ను వారే పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Katha Venuka Katha OTT : ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
వాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అంటూనే.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మకైన వాలంటీర్లపైనే సుధీర్ ఆ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు అచ్చెన్నాయుడు.. వైసీపీ చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటూ అరాచకం చేస్తున్న వాలంటీర్లను తెలుగుదేశం పార్టీ సమర్ధించదని స్పష్టం చేశారు. ఇక, సీఎం వైఎస్ జగన్ రెడ్డికి అవినీతికి వత్తాసు పలికిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే జైలుకు వెళ్లినా పట్టించుకోలేదన్నారు. వాలంటీర్లు చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఈ సందర్భంగా కోరారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.