టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఇవాళ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో చంద్రబాబు మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చాక.. మీ ఇంటికే ఒకటో తేదీనే పింఛన్ ఇచ్చేలా చేస్తామని అన్నారు. పింఛన్ ను నాలుగు వేలు పెంచి ఇస్తామని చంద్రబాబు తెలిపారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్రంలో ముస్లింలకు అండగా నిలిచే పార్టీ టీడీపీ అని స్పష్టం చేశారు. ముస్లింల 4…
ఎల్లుండి (బుధవారం) నుంచి సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర చేపట్టనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 'మేమంతా సిద్ధం' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహించనున్నారు. ఈ బస్సు యాత్ర ఇడుపులపాయ నుంచి మొదలై ఇచ్చాపురం వరకు సాగనుంది. ఈ నెల 27న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఘాట్ వద్ద ప్రార్ధనలు చేసిన అనంతరం మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించనున్నారు.
మందుబాబులకు టీడీపీ అధినేత చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామన్నారు. లోకల్ బ్రాండ్స్ తో వైసీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలుతో తీస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో మహిళలతో ముఖాముఖిలో మాట్లాడుతూ.. టీడీపీకి ఓటు వేస్తేనే భర్తలకు అన్నం పెట్టాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా.. కుప్పంలో లక్ష మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు కోరారు.
కుప్పం నియోజకవర్గ మహిళలతో టీడీపీ అధినేత చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళల ఆస్తిలో హక్కు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. ఆర్థిక స్వాతంత్రాన్ని మహిళలకు కల్పించిన పార్టీ టీడీపీ అని అన్నారు. డ్వాక్రా సంఘాలు పెట్టింది టీడీపీనేనని తెలిపారు. మరోవైపు.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద.. నెలకు 1500 వందల రూపాయలు అకౌంట్ వేస్తానని చంద్రబాబు చెప్పారు.
పశ్చిమ నియోజకవర్గంలో నేను లోకల్.. కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడమే న్యాయం అన్నారు పోతిన మహేష్.. గత 5 సంవత్సరాల నుంచి కష్టపడి పని చేశాం.. నాతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారన్న ఆయన.. పశ్చిమ నియోజకవర్గంలో కొండా ప్రాంతల అభివృద్ధికి జనసేన పార్టీ పాటుపడిందన్నారు.