Purandeswari: టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి.. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. బీజేపీలో చేరారు వివిధ రంగాలు, వర్గాలకు చెందిన పలువురు వ్యక్తులు. వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన పురంధేశ్వరి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీడీపీతో కలిసి వెళ్లాలని పార్టీ పెద్దలు నిర్ణయించారు.. మూడు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరం.. మూడు పార్టీల కలయిక త్రివేణి సంగమంగా అభివర్ణించారు. ఏపీలోని అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలని పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారన్న ఆమె.. పొత్తుల వల్ల పార్టీలో చాలా మంది ఆశావహులకు నిరాశ ఎదురైంది. కానీ, రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులు తప్పదని పార్టీ హైకమాండ్ భావించిందన్నారు.
Read Also: AP Pensions: ఏపీలో ఏప్రిల్ నెల పింఛన్లు రెండు రోజులు ఆలస్యం.. కారణం అదే..?
వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను తమ చేతుల్లోకి తీసుకుందని విమర్శించారు పురంధేశ్వరి. భారీ ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారు. అప్పులు భారీ ఎత్తున చేసేసింది ఈ ప్రభుత్వం. సెక్రటేరీయేట్టును, మద్యాన్ని, గనులను, ప్రభుత్వ భవనాలను, భూములను తనఖా పెట్టేశారని.. సెక్రటేరీయేట్టును తాకట్టు పెట్టకూడదని రాజ్యాంగంలో ఏమైనా రాశారా? అని ఓ వైసీపీ నేత కామెంట్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టే అధికారం ఈ ప్రభుత్వానికి ఎక్కడిది..? అంటూ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ అవినీతే అని ఆరోపించారు.. మహిళల పుస్తెలు తెగినా నాసిరకం మద్యం తాగిస్తామనే రీతిలోనే జగన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Kakarla Suresh: విభేదాలు వీడి ఐకమత్యంతో విజయం సాధిద్దాం..!
నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీలనే సీఎం జగన్.. ఆ వర్గాలకు ఏం న్యాయం చేశారు? అని ప్రశ్నించారు పురంధేశ్వరి.. ఎస్సీ, బీసీ, ఎస్టీల నిధులు దారి మళ్లించారు. ఎస్సీ యువకుడిని హత్య చేసిన ఎమ్మెల్సీని సీఎం తన పక్కన కూర్చొబెట్టుకుంటున్నారు. ఎస్సీలకు జగన్ చేసిన న్యాయం ఇదేనా..? అని మండిపడ్డారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ అంకితమై పని చేస్తుందని స్పష్టం చేశారు. వైసీపీ నిరంకుశ పాలన చూస్తున్నాం. సీఎం జగన్‌ను గద్దె దించాలంటే మూడు పార్టీల కూటమి.. త్రివేణి సంగమం అనివార్యం అన్నారు. బీజేపీ అభ్యర్థులనే కాదు.. కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. మూడు పార్టీల జెండాలు వేరైనా.. అజెండా మాత్రం ఒక్కటే.. మూడు పార్టీల కూటమి ప్రభుత్వంలోకి వస్తేనే ఏపీలో రామరాజ్యం వస్తుందన్నారు బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి.