Kakrla Suresh: ఓటు వేయండి.. చెప్పింది చేయకపోతే నిలదీయండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు దిక్చూచి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నారు ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేయకపోతే నిలదీయండి అని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రభుత్వంలోనే ఉదయగిరి అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. ఉదయగిరి మండల కేంద్రంలో ఉదయగిరి బీజేపీ నియోజకవర్గస్థాయి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కాకర్ల సురేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు ఉండవల్లి భరత కుమార్ యాదవ్, ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ.. నియోజకవర్గం గత 40 సంవత్సరాలుగా వెనకబడిపోయిందని, కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థంతో వలసలు పెరిగాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో పాటు.. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోనికి రావాలని తెలిపారు. 25 సంవత్సరాల ప్రణాళికతో ఇక్కడికి రావడం జరిగిందని.. 25 సంవత్సరాల కాలంలో అన్ని విధాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉదయగిరి రూపురేఖలు మారుస్తానని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఎవరు అధైర్య పడవలసిన అవసరం లేదని.. వచ్చేది ఉమ్మడి ప్రభుత్వమని.. ఎన్డీఏ ప్రభుత్వంలో పార్టీ కార్యకర్తకు నాయకులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ కార్యకర్తల నాయకుల జోలికి వచ్చిన వారి ప్రతి ఒక్కరి లెక్క తేలుస్తానన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కాకర్ల సురేష్ అనే నాకు సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్ర వేయడంతో పాటు.. మీకు తెలిసిన వారందరి చేత ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.
Also Read
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
Kakarla Suresh: నూతన వధూవరులను ఆశీర్వదించిన కాకర్ల సురేష్..
ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. రాక్షస పాలన అంతమొందించడానికి తామంతా కంకణబద్ధులమై ఉన్నామని, వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని విధాల నష్టపోయిందని ఆరోపించారు. మద్యం ఇసుక మైనింగ్ తో పాటు డ్రగ్స్ రాష్ట్రంగా తయారైందని దుయ్యబట్టారు. రాజధాని లేని రాష్ట్రంగా చేసిన జగన్మోహన్ రెడ్డిని, వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఇంటికి పంపుతామని ఘంటాపదంగా తెలిపారు. ప్రతి బీజేపీ నాయకుడిని కార్యకర్తలను అక్కున చేర్చుకొని అన్నదమ్ముల వలే ప్రేమించాలని కాకర్ల సురేష్ కు విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ కలిగిన కమలదళం వీర సైనికులై.. తన విజయానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ను మండలాలు వారిగా శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఉదయగిరి నియోజకవర్గస్థాయి బీజేపీ ఆత్మీయ సమావేశంలో తెలుగుదేశం మండల కన్వీనర్ బయన్న, మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి, వాకాటి నారాయణరెడ్డి, సురేష్ రెడ్డి, సురేందర్, ఆర్డీవిల్సన్, కందుకూరు నారాయణ, ఆంజనేయులు రెడ్డి, కె. బుచ్చిరెడ్డి, హనుమారెడ్డి, పులిచెర్ల నారాయణరెడ్డి, యం. బ్రహ్మారెడ్డి, వడ్డే శ్రీనివాసరెడ్డి, కే. మురళి నాయుడు, రాజశేఖర్ రెడ్డి, ఆండ్రా పరంధామ రెడ్డి, బి. మహేందర్ రెడ్డి, బి. సుబ్బరాయుడు, వెంకటస్వామి నాయుడు, ఏనుగు ప్రభాకర్ రెడ్డి, చుండు హరి గోపాల్ రెడ్డి, డేగ మధు యాదవ్, మల్లికార్జున, చంద్రమౌళి, చంద్రమౌళి, సింగాల రమణయ్య, ఎం. బాలకృష్ణారెడ్డి, పి. నారాయణ రెడ్డి, నందనవనం ప్రభాకర్ రావు, తిరుపతిరెడ్డి, రమేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
తాజావార్తలు
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!