Kurnool TDP: టీడీపీకి తలనొప్పిగా కర్నూలు.. ఐదు నియోజకవర్గాల్లో అదే తీరు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurnool TDP: ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో వర్గ విభేదాలు పతాకస్థాయికి చేరుకుంటున్నాయి. ఆ పార్టీకి 2019 ఎన్నికల్లో జిల్లా నుంచి ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదు. ఈ ఎన్నికల్లోనూ విభేదాలు పార్టీని దెబ్బతీసేలా కనిపిస్తున్నాయి. ఐదు నియోజకవర్గాల్లోని నేతలు ఈ ఎన్నికల్లో కలిసి పనిచేయటంలేదు. నంద్యాల నియోజకవర్గంలో మాజీ మంత్రి ఫరూక్‌ను అభ్యర్థిగా ప్రకటించిన తరువాత ఇంచార్జి భూమా బ్రహ్మానంద రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డారు. ఐతే.. అధిష్టానం నచ్చచెప్పి ఇద్దరినీ కలిపింది. ఆ తరువాత ఒక్కరోజు కూడా వాళ్లు కలిసి ప్రచారం చేయలేదు. భూమా బ్రహ్మానంద రెడ్డి తన ప్రచారంలో ఎక్కడా ఫరూక్ పేరు ప్రస్తావించటంలేదు.
Read Also: Virat Kohli: ‘ఛీటర్-ఛీటర్’ అంటూ నినాదాలు.. కోహ్లీ హృదయాన్ని ముక్కలు చేసిన భారత ఫాన్స్!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇక.. ఆలూరు నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించనప్పటికీ అక్కడ ఉన్న నాలుగు గ్రూపులు కలిసి పనిచేసే పరిస్థితి లేదు. కోట్ల సుజాత, వైకుంఠం జ్యోతి, వైకుంఠం ప్రసాద్, వీరభద్ర గౌడ్ మధ్య గ్రూపు తగాదాలున్నాయి. మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్ చేరిన తరువాత టీడీపీలో ఇక్కడ ఐదో గ్రూపు తయారైంది. అటు.. ఆదోనిలోనూ మీనాక్షి నాయుడుకు, వ్యతిరేకవర్గం తయారైంది. అదోని టికెట్ టీడీపీకే వస్తుందా? లేదా? అనే సందేహం ఉన్న దశలోనూ వర్గ విబేధాలు వీడలేదు. మీనాక్షి నాయుడు వద్దంటూ గతంలో అధిష్టానానికి వ్యతిరేకవర్గం ఫిర్యాదు చేసింది. మరోవైపు.. ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర రెడ్డికి వ్యతిరేకవర్గం సహకరించడం లేదు. గోనెగండ్ల, ఎమ్మిగనూరు టౌన్, రూరల్‌లో కొందరు మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు ఇంకా ప్రచారానికే వెళ్లడంలేదు.
Read Also: Shiv Sena: ఈ రోజే శివసేన-యూబీటీ తొలి జాబితా
మంత్రాలయం అభ్యర్థిగా రాఘవేంద్రరెడ్డిని ప్రకటించినప్పటి నుంచి ఇంచార్జి తిక్కారెడ్డి వర్గం నిరసనలు కొనసాగిస్తూనే ఉంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు సైతం సిద్ధమయ్యారు తిక్కారెడ్డి. కోడుమూరులో మాజీ ఇంచార్జి విష్ణువర్ధన్ రెడ్డి వర్గానికి చెందిన బొగ్గుల దస్తగిరికి టికెట్ దక్కింది. దీంతో ప్రస్తుత ఇంచార్జి ఆకుపోగు ప్రభాకర్ పనిచేయడం లేదు. మొత్తం మీద టీడీపీ అధిష్టానం గొడవలపై దృష్టి సారించకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే అధిష్టానం జోక్యం చేసుకుని ఈ విభేధాలకు చెక్ పెట్టాలని.. అంతా కలిసికట్టుగా పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని స్థానిక నేతలు, పార్టీ కేడర్ కోరుతున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!