బెజవాడ పశ్చిమ సీటుపై ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ సీటు కూటమి మొన్నటి వరకు బీసీ వ్యక్తికి ఇచ్చామని చెప్పింది.. పేద బీసీ వ్యక్తిని కాదని బీజేపీ నుంచి ధనికుడికి ఇపుడు టికెట్ ఇస్తున్నారని టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీలో ఉన్నపుడు కూడా పశ్చిమలో తన కుమార్తె శ్వేత పోటీ చేయదు అని ప్రకటించానన్నారు. పశ్చిమ సీటు మైనార్టీ లేదా బీసీలదని టీడీపీలో ఉన్నపుడు కూడా చెప్పానని తెలిపారు.
Earthquake: పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం.. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం
బీసీ, ఎస్సీ, ఎస్టీలను కాదని చార్టెడ్ ఫ్లైట్ లో తిరిగే వ్యక్తికి పేదలు ఉండే పశ్చిమ సీటును కూటమి నిలబెడుతోందని కేశినేని నాని విమర్శించారు. బీజేపీలకు పశ్చిమ సీటు ఇవ్వటమే పొరపాటు అని ఆరోపించారు. రెండేళ్లు కేంద్రమంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయని వ్యక్తిని ఇక్కడ ఎందుకు నిలబెడుతున్నారో ప్రజలకు తాము చెప్పాలన్నారు. అన్ని రకాలుగా తమను ఇబ్బంది పెట్టాలని చేస్తారని.. వ్యవస్థలను మేనేజ్ చేసే వ్యక్తి ఇక్కడ అభ్యర్ధిగా వస్తున్నాడు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కేశినేని నాని పేర్కొన్నారు.
Congress: కాంగ్రెస్ ఆరో జాబితా విడుదల.. ఏఏ రాష్ట్రాలంటే..!
కాగా.. మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజక వర్గం నుంచి ఏపీ అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. అధికారికంగా ఆయన పేరును ప్రకటించాల్సి ఉంది. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఆ పార్టీకి కేటాయించిన అసెంబ్లీ నియోజక వర్గాలపై బీజేపీలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇదిలా ఉంటే.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు తనకు ఇవ్వాలని జనసేన నేత పోతిన మహేష్ కోరారు. ఆయనకు పశ్చిమ సీటు కేటాయించాలని పోతిన మహేశ్ అనుచరులు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో తాను లోకల్ అని ఆయన అన్నారు. ఈ ఇద్దరిలో ఆ స్థానం నుంచి ఎవరు పోటీ చేయనున్నారని త్వరలోనే తేలిపోనుంది.