ఏప్రిల్, మే నెలలకు పెన్షన్ పంపిణీపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈఓ సర్క్యులర్ జారీ చేశారు. పెన్షన్ పంపిణీకి సంబంధించి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేయడం గమనార్హం.
నగరిలో మీ ఉత్సాహం చూస్తూ ఉంటే రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయని అనిపిస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరులో ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ సభలో గాలి భానుప్రకాష్, ఇతర నేతలు పాల్గొన్నారు. నగరి మీటింగ్ చూసిన తర్వాత జగన్ మైండ్ బ్లాక్ అవుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర ప్రారంభమైంది. ఇడుపులపాయ నుంచి ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు చేరుకున్న ముఖ్యమంత్రి జగన్... తన తండ్రి సమాధి వైఎస్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలను నిర్వహించారు.
కృష్ణా జిల్లా గుడివాడ ఒకటవ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం చంద్రబాబు గాడిది కాళ్లైనా పట్టుకుంటాడంటూ ఎద్దేవా చేశారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తాడని రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్, హిందూ సోదరులందరికీ తెలుసు.. ఆయన వెనకాల ఉన్న తెలుగు తమ్ముళ్లకు, పదిమంది జనసైనికులకు తప్ప అంటూ విమర్శలు గుప్పించారు.
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. సీటురాని అసంతృప్త నేతలు పార్టీలు మారుతున్నారు. వైసీపీలోకి జనసేన ముమ్మిడివరం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ చేరే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 30వ తేదీ నుంచి జనంలోకి వెళ్లనున్నారు జనసేనాని పవన్ కల్యాణ్... తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గంలోనే మూడు రోజులు మకాం వేయనున్నారు. 30 నుంచి మూడు రోజుల పాటు పిఠాపురంలోనే పవన్ కల్యాణ్ పర్యటన సాగనుంది. 30న నియోజకవర్గ నేతలతో సమీక్ష ఉంటుంది.
తనతో ఒక్క మాటైనా చెప్పకుండా అభ్యర్థిత్వం మార్చడం బాధాకరమని మాగంటి అంటున్నట్లుగా సమాచారం. మాగంటి వైఎస్ఆర్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం, తనకు అత్యంత ఆప్తుడు కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆ దిశగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది.