రేపు, ఎల్లుండి సీఎం వైఎస్ జగన్ తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు(సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకోనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.
విజయవాడ రైల్వే ఆడిటోరియంలో పీఎం విశ్వకర్మ యోజన పథకం ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి భగవంత్ కుబా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే డీఆర్ఎం, ఇతర రైల్వే అధికారులు కూడా పాల్గొన్నారు.
చంద్రబాబు అవినీతికి పాల్పడినందు వల్లే సీఐడీ అరెస్ట్ చేసిందని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీంతో తట్టుకోలేని టీడేపీ నేతలు ప్రభుత్వాన్ని, న్యాయవాదులను, న్యాయమూర్తులను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు.
విజయవాడలోని వన్ టౌన్ కోమల విలాస్ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి భగవంత్ కుబా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి హాజరయ్యారు.
మూఢనమ్మకాల పేరుతో కొందరు వ్యక్తులు ప్రజలను మోసం చేస్తున్నారు. నేల నుండి నింగికి చేరుకునే సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా.. ప్రజల్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. కళ్లకి ఎదురుగా మూఢనమ్మకాల పేరుతో డబ్బు దోచుకుంటున్న అపరచితులని గుడ్డిగా నమ్మి మోసపోతున్నారు.
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. రేపు(సోమవారం) ధ్వజారోహణంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
2024 ఎన్నికల్లో జనసేన బలమైన స్థానాలకో ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెడుతోందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవర్ షేరింగు తీసుకునే జనసేన వెళ్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.