టీడీపీ నేతలు సభకు చర్చకోసం కాదు.. రచ్చ కోసం వచ్చారని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. టీడీపీ నేత బాలకృష్ణపై విమర్శనాస్త్రాలు సంధించారు. మీ బావ తుప్పు కాదు.. నిప్పు అని ఒప్పుకోవడానికి మనసు రావడం లేదా అంటూ ఎద్దేవా చేశారు.
వ్యవస్థల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు వ్యాఖ్యానించారు. సభ పట్ల టీడీపీ నేతలకు ఏమాత్రం గౌరవం లేదని.. నియమాలు ఉల్లంఘించి ప్రవర్తిస్తున్న మీ తీరును ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ఆది పూజలు అందుకునే గణనాథుడిపై కొంత మంది భక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకుంటారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో కోటి 51 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో స్వామి వారికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు.
వినాయక చవితి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి అంతా ఇంతా కాదు. గల్లీ గల్లీలో గణేశుడిని కొలిచి పూజిస్తారు. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అందుకు భిన్నంగా ఉంది. ఖైరతాబాద్ గణేశుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి స్పందించారు. రాష్ట్రంలో పొత్తులపై తుది నిర్ణయం తమ పార్టీ అధిష్ఠానిదేనని ఆమె మీడియాతో అన్నారు.
ప్రజల, రాష్ట్ర ప్రయోజనాలే అజెండాగా పార్లమెంట్లో మా విధానం ఉంటుందని వైసీపీ ఎంపీ, ఆ పార్టీ లోక్సభా పక్ష నేత మిథున్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశాల పూర్తి అజెండాపై ఇప్పటి వరకు స్పష్టత లేదన్నారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలకు మార్గనిర్దేశం చేశారని తెలిపారు.