స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్‌కు ఆయన సతీమణి భువనేశ్వరికి జైలు అధికారులు అనుమతి తిరస్కరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయనగరం మెడికల్ కాలేజీ ప్రాంగణం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా ప్రారంభించారు.
తల్లిని మించిన దైవం లేదంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే తల్లిని మించి ఎవరూ లేరని అర్ధం. నవమాసాలు మోసి కని పెంచి కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే తల్లి మనసు కల్మషం లేనిది. కానీ అలాంటి అమ్మను ఎవరైనా చంపాలనుకుంటారా? ఊహించుకోడానికే మనసు దీనికి ఒప్పుకోదు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృత్యువాతపడ్డారు. ఆగి ఉన్న పాల వ్యాన్‌ను అంబులెన్స్ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా జగన్ సర్కారు ముందుకు సాగుతోంది. ఇవాళ 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం కానున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కలిసే వస్తామని ఆయన ప్రకటించారు. చంద్రబాబుతో ములాఖత్ ఏపీ రాజకీయాల్లో కీలకమైందని, వైసీపీ అరాచకాలను సమిష్టిగా ఎదుర్కోవాలన్నారు. ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తాయని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 20కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు, ప్రభుత్వ తరపున న్యాయవాదులు వాయిదా కోరటంతో న్యాయస్థానం వాయిదా వేసింది.