*ఇదే రోజు తెలంగాణ రాచరికం ముగిసి.. ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైంది: కేసీఆర్
తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 ప్రత్యేకమైనదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. 1948లో ఇదే రోజున తెలంగాణ రాచరికం అంతమై ప్రజాస్వామ్య పాలన ప్రారంభమైందని గుర్తు చేశారు. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బ్రిటీష్ పరిపాలన వెలుపల రాజుల పాలనలో ఉన్న ప్రాంతాలను భారత యూనియన్‌లో విలీనం చేసే ప్రక్రియను అప్పటి భారత ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే 1948 సెప్టెంబర్ 17న మన హైదరాబాద్ రాష్ట్రం గ్రేటర్ ఇండియాలో అంతర్భాగమైంది.ఈ పరిణామంతో తెలంగాణ రాచరికం అంతమై పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిపాలన మొదలైంది. ఈ సందర్భాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకోవడం సముచితమని తెలంగాణ ప్రభుత్వం భావించింది. అందుకే నేడు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండాలను ఎగురవేస్తాం’’ అని తెలిపారు. తెలంగాణ గడ్డపై సీఎం కేసీఆర్ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. న్యాయం, ధర్మం, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం తమ ప్రాణాలకు విలువ లేకుండా పోయిందని భావించిన తెలంగాణ సమాజం గుండెలు పగిలేలా నిలిచాయన్నారు. ఆనాటి సామాన్య ప్రజల పోరాట ఘట్టాలు జాతి గుమ్మాల్లో ఎప్పుడూ వెలుగుతాయని అన్నారు. దొడ్డి కొమురయ్య నుంచి చాకలి ఐలమ్మ వరకు, కొమురం భీమ్ నుంచి రావినారాయణరెడ్డి వరకు, షోయబుల్లాఖాన్ నుంచి శూరవరం ప్రతాప్‌రెడ్డి వరకు, స్వామి రామానంద తీర్థ నుంచి జమలాపురం కేశవరావు వరకు, బండి యాదగిరి నుంచి సుద్దాల హనుమంతు, కాళోజీ, దాశరథి వరకు పలువురు స్మారకోపన్యాసాలు చేస్తున్నారు. జాతీయ ఐక్యతా దినోత్సవం. ట్టుగా అన్నారు. మహాత్మాగాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి నాయకుల కృషి వల్లే ప్రస్తుత భారతదేశం సాధ్యమైందన్నారు. తెలంగాణ భారతదేశంలో భాగమైన తర్వాత 1956 వరకు హైదరాబాద్ రాష్ట్రంగా ఆవిర్భవించిందని, ఆ తర్వాత తెలంగాణ ప్రజల ఆలోచనలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని అన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి, ప్రజలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పోరాటానికి నాయకత్వం వహించే గొప్ప అవకాశాన్ని చరిత్ర తనకు కల్పించిందని కేసీఆర్ అన్నారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే గురుతర బాధ్యతను కూడా ప్రజలు తన భుజస్కంధాలపై వేసుకున్నారని కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ రాష్ట్ర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడుస్తున్నా పేదరికం, నిరుద్యోగం, సామాజిక వివక్ష దేశాన్ని పట్టి పీడించడం విచారకరమన్నారు. తెలంగాణలో మానవతా దృక్పథంతో పథకాలు రూపొందించి ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేయడంతో పాటు సంపదను పెంచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలు అందని కుటుంబం నేడు రాష్ట్రంలో లేదని చెప్పాలన్నారు. ప్రభుత్వ పథకాల ఫలితంగా రాష్ట్రంలో పేదరికం తగ్గి తలసరి ఆదాయం పెరిగిందన్నారు. తెలంగాణలో 2015-18లో 13.18 శాతం ఉన్న పేదరికం 2019-21 నాటికి 5.88 శాతానికి తగ్గిందని చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు, వాటి విజయాలను కేసీఆర్ వివరించారు.
*సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణకి విముక్తి లభించేది కాదు
సర్దార్ పటేల్ లేకపోతే.. తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించకపోయేదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. దేశమే సర్వస్వమే నినాదంతో.. ఆపరేషన్ పోలోను ప్రారంభించారన్నారు. రక్తం చుక్క పారకుండా.. తెలంగాణకు స్వాతంత్య్రం అందించారన్నారు. పటేల్, కేఎం మున్షీ సంయుక్త ఆధ్వర్యంలో ఇది జరిగిందన్నారు. బ్రిటిషర్ల నుంచి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 399 రోజుల పాటు ఇక్కడ పోరాటం జరిగిందన్నారు.ఉస్మానియాలో వందేమాతరం ఉద్యమం, ఆర్య సమాజ్, హిందూ మహాసభ వంటి సంస్థలెన్నో కలిసి ఉద్యమాలు చేశాయన్నారు. 75 ఏళ్ల వరకు దేశంలోని ఏ ప్రభుత్వం కూడా.. మన యువతకు మన స్వాతంత్య్ర పోరాటాన్ని గురించి చెప్పేందుకు ప్రయత్నించలేదన్నారు. మోదీకి ఈ సందర్భంగా.. ధన్యవాదములు తెలియజేస్తున్నానని తెలిపారు. 17 సెప్టెంబర్ కు సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపాలని ఆయన నిర్ణయించారని తెలిపారు. యువతకు దేశభక్తి, మనసంస్కృతికి గురించి మన పెద్దల పోరాటం గురించి తెలియాలన్నారు. మన పోరాటం చేసిన వారిని స్మరించుకోవాలన్నారు. వారు కలలుగన్న రాష్ట్రాన్ని నిర్మించుకునేందుకు కృషి చేయాలన్నారు. సశస్త్ర సీమాబల్ ఉద్యోగులకోసం క్వార్టర్లకు భూమి పూజ చేశామన్నారు. షోయబుల్లాఖాన్, రాంజీగోండ్ గారిపేర్లతో స్పెషల్ పోస్టల్ కవర్ రిలీజ్ చేసుకుంటున్నామన్నారు. నరేంద్ర మోదీజీ జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. 2014లో 11వ ఆర్థిక వ్యవస్థ నేడు 5వ స్థానంలో ఉందన్నారు. చంద్రయాన్ 3 విజయవంతం అయిందని తెలిపారు. జీ20 ద్వారా దేశ, సంస్కృతి సంప్రదాయాలను మరోసారి ప్రపంచానికి తెలియజేశారని తెలిపారు. జీ 20 ను జీ21గా మార్చిన ఘనత మన ప్రధాని మోదీ ది అన్నారు. ప్రపంచమంతా భారతదేశం సాధిస్తున్న ప్రగతిని ప్రశంసిస్తోందన్నారు. తెలంగాణ చరిత్ర.. ప్రపంచానికి తెలియలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాజ్యంగా ఏర్పడితే.. ఇది భారతమాత కడుపులో కేన్సర్ గా మారిందని పటేల్ గుర్తించారని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటం స్ఫూర్తితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పరకాలలో 1500 మంది జాతీయ జెండాను ఎగరేసినందుకు జలియన్ వాలాబాగ్ తరహాలో కాల్చి చంపారని తెలిపారు. పర్భణిలో, బీదర్ లోనూ ఇలాగే జరిగిందన్నారు. వీటి నుంచి విముక్తి కల్పించేందుకు పటల్ సంకల్పించారని తెలిపారు. 10 ఆగస్టు, 1948నాడు.. హైదరాబాద్ సంస్థానం విలీనమే.. దేశ సమైక్యతకు మార్గమని నిర్ణయించారని తెలిపారు. 17 సెప్టెంబర్ నాటికి మిషన్ పూర్తిచేశారని షా తెలిపారు.
*విమోచనం కోసం మొదటిసారి గొంతు ఎత్తిన పార్టీ బీజేపీ
విమోచనం కోసం మొదటిసారి గొంతు ఎత్తిన పార్టీ బీజేపీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన దినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర శాఖ తరపున, మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ తరపున ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గత 25 సంవత్సరాలుగా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకం ఎగురవేయడం జరుగుతుందన్నారు. విమోచనం కోసం మొదటిసారి గొంతు ఎత్తిన పార్టీ బీజేపీ. నిజాంకు వ్యతిరేకంగా లక్షలాదిమంది పోరాడిన పోరాటాన్ని చరిత్రను కాంగ్రెస్ పార్టీ సమాధి చేసే ప్రయత్నం చేసిందన్నారు. అనేక మంది యోధులు భూమికోసం భుక్తి కోసం స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం నిజాంకు ఎదురు నిలబడి పోరాటం చేశారని తెలిపారు. అలాంటి వారి త్యాగాలను గుర్తించకుండా సెప్టెంబర్ 17న విమోచన ఉత్సవాలు జరపకుండా కాంగ్రెస్ పార్టీ ఘోరతప్పిదం చేసిందన్నారు. తర్వాత వచ్చిన టీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ బాటలోనే నడుస్తుందని తెలిపారు. ఎందుకంటే ఈ రెండు పార్టీలు ఒకటే అని మండిపడ్డారు. ఈ రెండు పార్టీల గురువు ఎంఐఎం పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పంచన చేరి దాన్ని తోలుబొమ్మల ఆట ఆడిస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన ఉత్సవాలు జరపకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాయన్నారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ చరిత్రను 1998 నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిందన్నారు. బీజేపీ కార్యకర్తలు అనేక పోరాటాలు చేసి పోలీసుల తూటాలకు ఎదురు నిలబడి విమోచన ఉత్సవాలు జరపాలని డిమాండ్ చేశారు. అలాంటి పోరాటాలను గుర్తించే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణ విమోచన ఉత్సవాలను అధికారికంగా జరుపుతున్నదని తెలిపారు. నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ చర్య ద్వారా నిజాం నోడించి హైదరాబాద్ గడ్డపై మూడు రంగుల జెండా ఎగరవేశారని అన్నారు. 75 ఏళ్ల తర్వాత నేటి హోం మంత్రి అమిత్ షా గారు త్రివర్ణ పతాకం ఎగరవేయబోతున్నారని తెలిపారు. తెలంగాణ చరిత్రను సమాధి చేసిన అణగదొక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ పార్టీ ఏ ముఖం పెట్టుకొని హైదరాబాదులో వర్కింగ్ కమిటీ సమావేశాలు పెట్టుకున్నదో ప్రజలు అడగాలని తెలిపారు. సెప్టెంబర్ 17 నాడు కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ గడ్డమీద మీటింగ్ పెట్టుకునే నైతిక అర్హత లేదు. తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపని దోషి కాంగ్రెస్ పార్టీ అన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తల తోక లేకుండా సెప్టెంబర్ 17న సమైక్యత దినోత్సవాలు అంటుందని తెలిపారు. సమైక్యత దినోత్సవం ఎలా వచ్చిందో కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు అడగాలని అన్నారు. మూర్ఖత్వంతో ఓటు బ్యాంకు రాజకీయాలతో మజ్లీస్ తో కుమ్మక్కై టీఆర్ఎస్ పార్టీ ఈరోజు సమైక్యత దినోత్సవం అంటున్నారు. ఇది సమైక్యత దినోత్సవం ఎలా అవుతుందో కేసీఆర్ చెప్పాలన్నారు. ఈ రెండు పార్టీలు 75 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని తెలిపారు. వచ్చే సంవత్సరం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ గ్రామాన తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుతామన్నారు. మజిలీస్ పార్టీతో మాకు అవసరం లేదు మజిలీస్ అంటే మాకు భయం లేదన్నారు. కానీ మీకు ఆ పార్టీ మోచేతి నీళ్లు తాగుతారు కాబట్టి ఆ పార్టీ మీకు గురువు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే మీరు దానికి భయపడుతున్నారని అన్నారు. విమోచన ఉత్సవాలు జరిపే ధైర్యం ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు.
*సీఎం జగన్ షెడ్యూల్
రేపు, ఎల్లుండి సీఎం వైఎస్ జగన్ తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు(సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి చేరుకోనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. శ్రీనివాస సేతు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. ఎస్‌వీ ఆర్ట్స్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తాతయ్యగుంట గంగమ్మ ఆలయానికి చేరుకుని గంగమ్మను దర్శనం చేసుకోనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుమలకు వెళ్లనున్నారు. వకుళామాత రెస్ట్ హౌస్, రచన రెస్ట్ హౌస్‌ల ప్రారంభోత్సవంలో పాల్గొని వాటిని ప్రారంభించనున్నారు. బేడీ ఆంజనేయ స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు ప్రధాన ఆలయానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. వాహన మండపం వద్దకు చేరుకుని పెద్ద శేష వాహనాన్ని దర్శనం చేసుకోనున్నారు. రాత్రికి పద్మావతి అతిధి గృహంలో బస చేయనున్నారు. ఈ నెల 19న ఉదయం 6.20 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామి వారిని సీఎం జగన్ దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి కర్నూలు జిల్లాకు సీఎం జగన్ ప్రయాణం కానున్నారు. కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి మండలం లక్కసాగరానికి ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. డోన్, పత్తికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు సంబంధించి తాగు, సాగునీరందించే పథకాలను ప్రారంభించనున్నారు. నంద్యాల జిల్లా డోన్‌లో బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. రెండు రోజుల పర్యటన ముగించుకుని తిరిగి తాడేపల్లికి సీఎం జగన్ తిరుగు ప్రయాణం కానున్నారు.
*టీడీపీ నేతలు కూడా చంద్రబాబును పట్టించుకోవట్లేదు..
చంద్రబాబు అవినీతికి పాల్పడినందు వల్లే సీఐడీ అరెస్ట్ చేసిందని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీంతో తట్టుకోలేని టీడేపీ నేతలు ప్రభుత్వాన్ని, న్యాయవాదులను, న్యాయమూర్తులను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారని ఆయన చెప్పారు. 14 ఏళ్ల అధికారంలో ఉన్న టీడీపీ రాజ్యాంగ వ్యవస్థలను అవమానించడం సరికాదన్నారు. ఓటుకు నోటు కేసులో చిక్కిన చంద్రబాబు అక్కడ అరెస్టు చేస్తారనే భయంతో హడావిడిగా వచ్చేశారని విమర్శించారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల పాలు చేశారని విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన చంద్రబాబు.. అక్కడ పరిమితంగా ఐదేళ్లు పాలించినా ఆంధ్ర ప్రదేశ్‌లో పరపతి ఉందా అంటూ వ్యాఖ్యానించారు. ఐదేళ్లు పాలించినా చంద్రబాబును పట్టించుకోవడం లేదన్నారు. చివరకు టీడీపీ నేతలు కూడా చంద్రబాబును పట్టించుకోవడం లేదన్నారు. లోకేష్ ఢిల్లీ యాత్రకు వెళ్ళాడని.. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన విషయాన్ని వివరించేందుకు ఢిల్లీకి వెళ్ళాడని టీడీపీ నేతలు చెప్పారని.. ఢిల్లీలో కూడా లోకేష్ ఏమీ చెప్పలేకపోయాడని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు ఏ లాయర్లను పట్టుకుంటే బాగుంటుందనే విషయంపై లోకేష్ చర్చిస్తున్నాడని ఆయన అన్నారు. చంద్రబాబును బయటకు తెచ్చేందుకే న్యాయవాదుల చుట్టూ తిరుగుతున్నాడన్నారు. లోకేష్‌ను కూడా అరెస్ట్ చేస్తారని బ్రాహ్మణి ఆందోళన వ్యక్తం చేసిందని మంత్రి పేర్కొన్నారు. లోకేష్ కూడా అవినీతిగా పాల్పడ్డారని చంద్రబాబు కుటుంబం భావిస్తోందని ఆయన చెప్పారు. జరిగిన అవినీతి కుటుంబ సభ్యులకు తెలుసు కాబట్టి వాళ్లు భయపడుతున్నారన్నారు. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ తన భార్యకు ఆరోగ్యం బాగలేక సెలవు పెడితే ఎన్నో కథనాలను సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన భార్య చనిపోయిన తర్వాత ప్రజలకు వాస్తవం తెలిసిందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డాడని పవన్ కళ్యాణ్ చెప్పాడని.. ఇప్పుడు చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తానని చెబుతున్నాడని ఆయన ఆరోపించారు. నాలుగు శాతం ఓట్లు లేని పవన్ కళ్యాణ్. .. వైసీపీని అడ్డుకుంటానని చెప్పడం హస్యాస్పదమన్నారు. చంద్రబాబు చేసిన అవినీతికి ఎప్పుడో 15 ఏళ్ల జైలు శిక్ష పడాల్సి ఉండేదని మంత్రి అన్నారు. కోర్టుల నుంచి స్టే తెచ్చుకొని కొనసాగుతున్నాడన్నారు. టీడీపీ నేతలు న్యాయమూర్తులను, న్యాయవాదులను బెదిరిస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు.
*ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ పుట్టిన రోజు శుభాకాంక్షలు..
ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజులో 73వ ఏట అడుగుపెట్టారు.రాష్ట్రపతితో పాటు బీజేపీ పార్టీ నేతలు, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా ప్రధాని మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రధాని నరేంద్రమోడీకి జన్మదిన శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేశారు. దేశ నాయకుల నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకుల నుంచి విషెస్ వెల్లివెత్తుతున్నాయి. అంతకు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానికి బర్త్ డే విషెస్ చెప్పారు. మోడీ తన దూరదృష్టి మరియు బలమైన నాయకత్వంతో ‘అమృత్ కాల్’ సమయంలో భారతదేశం ప్రతి రంగంలో అభివృద్ధికి బాటలు వేయాలని ఆమె ఆకాంక్షించారు. న్యూ ఇండియా రూపశిల్పి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. దేశ ప్రాచీన వారసత్వం ఆధారంగా గొప్పి, స్వావలంబన భారతదేశానికి బలమైన పునాది వేశారని అన్నారు. భారత ప్రతిష్టను పెంచారని జేపీ నడ్డా ప్రశంసించారు. ప్రధాని మోడీ కేవలం భారతదేశానికి కొత్త గుర్తింపు ఇవ్వడమే కాకుండా, ప్రపంచంలో భారత ప్రతిష్టం పెంచారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కొనియాడారు. ఇదిలా ఉంటే తన జన్మదినం రోజున ప్రధాని మోడీ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
*5 రోజులుగా ఎన్‌కౌంటర్.. ఇంకా చిక్కని ఉగ్రవాదులు.. ఆర్మీకి సవాళ్లు..
జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ ఎన్‌కౌంటర్ 5వ రోజుకు చేరుకుంది. బుధవారం ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటికే నలుగురు ఆర్మీ అధికారులు వీరమరణం పొందారు. ఎలాగైన ఉగ్రవాదులను మట్టుపెట్టాలనే వ్యూహాలతో భద్రతాసిబ్బంది ఉంది. అయితే దట్టమైన అడువులు, కొండలు, లోయలు ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్నాయి. జింగిల్ వార్‌ఫేర్ లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు సైన్యానికి సవాల్ విసురుతున్నారు. 100 గంటలకు పైగా భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. డ్రోన్లు, హెలికాప్టర్లు, ఐఈడీ బాంబులు ఇలా అత్యాధునిక ఆయుధాలను సైన్యం ఉపయోగిస్తోంది. అయితే పీఓకే సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతం గురించి ఉగ్రవాదులకు మంచి పట్టు ఉండటం, దాడి చేసి సులువుగా పాకిస్తాన్ లోకి వెళ్లడం చేస్తున్నారు. భారీగా ఆయుధాలు కలిగిన ఉగ్రవాదులు అడవిలో వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్నట్టు సైన్యం అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే శనివారం ఆర్మీ నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఎన్కౌంటర్ ప్రదేశాన్ని సందర్శించారు. బుధవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ ఎన్కౌంటర్ లో టెర్రిస్టుల స్థావరానికి చేరుకోవాలని భద్రతా బలగాలు అడవిలోకి ప్రవేశించాయి. అయితే ప్లాన్ ప్రకారం ఒక లోయప్రాంతానికి చేరుకుంటారని అంచనా వేసిన టెర్రరిస్టులు భద్రతా బలగాలపైకి కాల్పులు జరిపారు. ఈ ఆపరేషన్ కి ముందుండి నాయకత్వం వహించిన కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ , మేజర్ ఆశిష్ ధోంచక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హిమయూన్ భట్, మరో సైనికుడు మరణించాడు. తీవ్రవాదులు అటవీ, ఎతైన ప్రదేశాల్లో దాడుల్లో ఆరితేరి ఉన్నారు. ఎక్కువ కాలం యుద్ధం చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసుకున్నారు. ఇలాంటి దాడులను ఎదుర్కోవడం చాలా కష్టంతో కూడుకున్నదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలోని రాజౌరి, పూంచ్ ఏరియాల్లో ఇలాంటి యుద్ధవ్యూహాలనే తీవ్రవాదులు అనుసరిస్తున్నారు. మే నెలలో ఇలాగే జరిగిన దాడిలో మొత్తం 10 మంది సైనికులు మరణించారు. ఈ ప్రాంతంలోని పీర్‌పంజల్ పర్వతాలు, దట్టమైన పైన్ అడవులు ఉగ్రవాదులకు ఆసరాగా ఉన్నాయి. దీనికి తోడు దాడులు చేసి వెంటనే పీఓకే వెళ్లేందుకు ఈ పర్వతాలు, అడవులు సహకరిస్తున్నాయి. ఈ దట్టమైన అడవులు పీఓకే, జమ్మూ కాశ్మీర్ మధ్య ఉండటంతో తరుచూ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడుతుున్నారు. ఈ అడవుల్లో ముందున్న మనిషిని కూడా గుర్తించలేని పరిస్తితి ఉంటుంది. అయితే ఇలాంటి సౌకర్యాల కారణంగానే భద్రతా బలగాలు అడవుల్లోకి ప్రవేశించిన వెంటనే అప్పటికే పొజిషన్ తీసుకున్న ఉగ్రవాదులు, కాల్పులు జరిపి ఎక్కువ మంది సైనికులను బలితీసుకుంటున్నారు.
*మీరు ప్రధాని మోడీకి డైరెక్ట్ గా బర్త్ డే విషెస్ చెప్పాలనుకుంటున్నారా..?
నేడు ప్రధాని మోడీ పుట్టిన రోజు ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా అనేక ప్రత్యేక కార్యక్రమాలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఇవాళ అనేక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కాగా.. ప్రధాని మోడీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఇవాళ్టి నుంచి ‘సేవా పఖ్వాడా’ అనే కార్యక్రమం స్టార్ట్ చేసింది. దీంతో పాటు నమో యాప్ లో ‘ఎక్స్‌ప్రెస్ యువర్ సేవా భావ్’ క్యాంపెయిన్ ను ఆరంభించింది. ఇందులో పాల్గొనడం వల్ల ప్రధాని నరేంద్ర మోడీకి ప్రతీ ఒక్కరూ నేరుగా బర్త్ డే విషెస్ తెలిపే ఛాన్స్ ఉంది. దేశానికి సేవ చేసేలా పౌరులను ప్రేరేపించడమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశమని కమలం పార్టీ తెలిపింది. ఈ నమో యాప్ ద్వారా ప్రజలు నేరుగా ప్రధాని నరేంద్ర మోడీకి వీడియో సందేశం పంపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పొచ్చు. దీని కోసం శుభాకాంక్షలు తెలుపుతున్న వీడియోను మీ ఫోన్ లో రికార్డ్ చేసి.. దాన్ని నమో యాప్ లో అప్ లోడ్ చేయాలి. ఈ వీడియో గ్రీటింగ్స్ వీడియో వాల్ పై కూడా కనపడుతుంది. దీన్ని రీల్ ఫార్మట్ లో తయారు చేసి అప్ లోడ్ చేయాలి. ఈ వీడియోతో పాటు ప్రధానికి ‘సేవ బహుమతి’ కూడా ఇవ్వొచ్చని బీజేపీ తెలిపింది. నమో యాప్ వినియోగించే వారు.. లేదా ఇంకా ఎవరైనా కింద సూచించిన సేవా కార్యక్రమాలు చేసిన ప్రధానికి గిఫ్ట్ గా ఇవొచ్చు. ఇందులో తొమ్మిది విభిన్న సేవా కార్యక్రమాలు ఉంటాయి. దాన్ని పూర్తి చేసిన తర్వాత యూజర్ ఫోటోలను అప్ లోడ్ చేసుకోవచ్చు.. ఈ సేవా కార్యక్రమాలను పూర్తి చేసిన తరువాత పొందిన బ్యాడ్జీలను మీ కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్ కు సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంతో పాటు కుటుంబం అంతా ప్రధానికి ఒకే సారి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపే ఛాన్స్ నమో యాప్ కల్పించింది. ‘ఫ్యామిలీ ఈ కార్డ్’ అనే ఆప్షన్ ద్వారా దానికి సంబంధించిన వీడియోను ఒకే గ్రీటింగ్ లో చేర్చే అవకాశం ఉంది.
*అనిరుధ్ తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కీర్తి తండ్రి..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మహానటి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది ఈ భామ.అంతేకాదు ఆ సినిమాకి జాతీయ అవార్డు కూడా సొంతం చేసుకుంది.. ఇకపోతే ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న కీర్తి సురేష్ రీసెంట్ గా రిలీజ్ అయిన దసరా సినిమాతో అద్భుతమైన హిట్ అందుకుంది.ఈ సినిమాలో తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో కీర్తి అదరగొట్టింది. ఇదిలా ఉంటే తాజాగా తన పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ తో కీర్తి పెళ్లి జరగబోతుంది అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అలాగే వారిద్దరూ క్లోజ్ గా దిగిన ఫొటోస్ కూడా బాగా వైరల్ అయ్యాయి.ఇక అనిరుద్ రవిచందర్ తో కీర్తి పెళ్లి అంటూ వస్తున్న ఈ వార్తలపై కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. కీర్తి, అనిరుధ్ పై వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం నిరాధారమైనవి. వాటిలో ఏమాత్రం కూడా నిజం లేదు. కీర్తి పెళ్లి గురించి ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి కానీ అవన్నీ కూడా అవాస్తవాలు మాత్రమే అంటూ ఆయన ఖండించారు.ఎవరో కావాలని అనిరుధ్ , కీర్తి సురేష్ ల గురించి ఒక వార్తను క్రియేట్ చేసి దానిని ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నారు అంటూ ఆయన మండిపడ్డారు. మరొకవైపు కీర్తి సురేష్ కూడా స్పందిస్తూ అది ఫేక్ న్యూస్…. అనిరుద్ నాకు మంచి స్నేహితుడు మాత్రమేనని ఆమె తెలిపింది. ఇకపోతే అనిరుద్, కీర్తి సురేష్ మధ్య పుకార్లు రావడానికి కారణం అజ్ఞాతవాసి, గ్యాంగ్ , రెమో వంటి చిత్రాల కోసం వీళ్లిద్దరూ కలిసి పనిచేశారు. ఇటీవల ఆమె జవాన్ లోని బ్లాక్ బస్టర్ సాంగ్ చలేయా పాటకు డైరెక్టర్ అట్లీ భార్య కృష్ణప్రియ తో కలిసి డాన్స్ కూడా చేసింది. ఆ వీడియో బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే.ఇలా వీరిద్దరూ బాగా క్లోజ్ గా ఉండడంతో రూమర్స్ బాగా వచ్చాయి..