విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ సమీపంలో ఓ బాలుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని గోనెసంచిలో చుట్టి దుండగులు సముద్రంలో పడేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఏ భార్య అయినా తన భర్త ఆరోగ్యంగా ఉండాలని.. తాను సుమంగళిగా వర్థిల్లాలని కోరుకుంటుంది. ఏ అర్థాంగి అయినా ఇది ఆశిస్తుంది. తన భర్త మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోతే ఏ మహిళ సహించలేదు. కొందరు పెద్దలకు చెప్పుకుని బాధపడుతుంటారు. కానీ ఓ స్త్రీమూర్తి ఏమనుకుందో కానీ తన భర్తను గాడిన పెట్టి తన సంసారాన్ని చక్కదిద్దుకోవాలని నిర్ణయించుకుంది.
తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు.ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు.
ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. రాష్ట్రానికి మరో రేపటి నుంచి వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. దీనిని విజయవాడ-చెన్న నడపాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు ఇది మూడో వందేభారత్ రైలు కానుంది. రేపు ఉదయం 10:30 గంటలకు జెండా ఊపి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరువీధుల్లో స్వామివారి బంగారు తేరుపై ఊరేగారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సోమవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. సోమవారం ఏసీబీ కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలిరోజు సీఐడీ విచారణ ముగిసింది. రాజమండ్రి సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులోనే అధికారులు విచారణ చేపట్టారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని 12 మంది సభ్యుల బృందం ఆయన్ను ఉదయం 9.45 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారించింది. చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ సమక్షంలో ఈ విచారణ కొనసాగింది.