Botsa Satyanarayana: స్కామ్‌లో వాస్తవాలు తెలుసు కాబట్టే పారిపోతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: ప్రతిపక్ష టీడీపీ ఒక పథకం ప్రకారం సభా సమయాన్ని వృథా చేస్తుందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబుపై కేసు ఎత్తేయాలని రచ్చ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెండు రోజులుగా సభలో టీడీపీ అసభ్యంగా ప్రవర్తిస్తుందని ఆయన విమర్శించారు. చర్చకు రమ్మంటే ఎందుకు టీడీపీ రావటం లేదో సమాధానం చెప్పాలన్నారు. స్కామ్‌లో వాస్తవాలు తెలుసు కాబట్టే టీడీపీ నేతలు పారిపోతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. స్కిల్ స్కామ్‌లో ఎంత అవినీతి జరిగిందో.. ఎలా జరిగిందో తాము సభలో చెప్పామన్నారు. టీడీపీ ఏం చెప్తుందో సభలో చెప్పొచ్చుగా అంటూ పేర్కొన్నారు. చర్చల్లో పాల్గొంటే దొరికిపోతాం అని టీడీపీ భయపడుతుందని మంత్రి చెప్పారు. తప్పు చేశారు కాబట్టే హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేసిందని ఆయన తెలిపారు. సీమెన్స్ ఒప్పందం ప్రకారం నిధులు ఏమయ్యాయో టీడీపీ సమాధానం చెప్పాలన్నారు.
Also Read: RK Roja: బాలకృష్ణకు సినిమాల్లో మాత్రమేనా.. అసెంబ్లీలో చేతకాదా?
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
టీడీపీ అధినేత చంద్రబాబు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అయినా కూడా ఏకపక్షంగా కేసులు ఎత్తి వేయాలని టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టు మీద చర్చకు రమ్మని తాము కోరితే రావడం లేదని అన్నారు. సభ నుంచి వారు ఎందుకు పారిపోయారని మంత్రి ప్రశ్నించారు. అసెంబ్లీలో తాము పూర్తి వివరాలతో వివరించామని మంత్రి పేర్కొన్నారు. చంద్రబాబు ప్రమేయం లేకుండా కోట్లాది రూపాయలు ఎలా పక్క దారి పడతాయని ప్రశ్నించారు. ఏయే కంపెనీల ద్వారా డబ్బు కొల్లగొట్టారో సీఐడీ నిగ్గు తేల్చిందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..