Ganesh Festival: వినాయకుడికి రూ.1.51 కోట్ల నోట్లతో అలంకరణ.. అద్భుతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ganesh Festival: ఆది పూజలు అందుకునే గణనాథుడిపై కొంత మంది భక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకుంటారు. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో కోటి 51 లక్షల రూపాయల కరెన్సీ నోట్లతో స్వామి వారికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. వాసవి మార్కెట్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక అలంకరణ అందరినీ ఆకట్టుకుంటోంది. నందిగామ పట్టణంలోని వాసవి మార్కెట్‌లో అరుదైన వినాయకుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణను సంతరించుకుంది. ఉత్సవ కమిటీ సభ్యులు స్వామి వారి అలంకరణకు కావలసిన నగదును సేకరించి వినాయక మండపాన్ని అలంకరించారు. 41 ఏళ్ల నుంచి వీళ్లు ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. అలంకరణ కోసం ఉపయోగించే కరెన్సీ నోట్ల విలువ ఏటా అంతకంతకూ పెరుగుతోంది. ఈ గణపతిని దర్శించుకునే భక్తుల సంఖ్య కూడా అలాగే పెరుగుతోంది.
Also Read: Chandrababu: సీఐడీ కస్టడీకి చంద్రబాబు
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఈ మండపాన్ని రూ. 2వేలు, 500, 200, 100, 50 కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ కరెన్సీ వినాయకుడిని వీక్షించడానికి నందిగామ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు క్యూ కడుతున్నారు. రాత్రింబవళ్లు గణేష్ ఉత్సవ కమిటీ అతి కష్టంతో ఈ కరెన్సీ వినాయకుడిని తయారు చేశారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!