Tirumala: తిరుమల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు వివిధ వాహనాలపై తిరుమల మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు.ఇవాళ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు గజవాహనంపై మాడ వీధుల్లో విహరిస్తూ స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. గజవాహనంలో మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. గజవాహనంలో ఊరేగుతున్న స్వామి వారి దర్శనం చేసుకుంటే కర్మం నుంచి విముక్తి లభిస్తుందని పురాణాల్లో ఉంది. భక్తులు కూడా విశ్వసిస్తారు.
Also Read: Tirumala: వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. స్వర్ణరథంపై ఉభయదేవేరులతో గోవిందుడు
గజవాహనంపై మాడా వీధుల్లో ఊరేగుతూ.. స్వామివారు భక్తులకు అభయప్రదానం చేశారు. గజవాహనంలో ఊరేగుతున్న స్వామివారిని దర్శిస్తే.. కర్మం నుంచి విముక్తి లభిస్తుందని పురాణాల్లో ఉంది. భక్తులు కూడా విశ్వసిస్తారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు ఉదయం శ్రీవారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. పరిమళ భరిత పూలమాలలు, విశేష ఆభరణాలతో అలంకృతులైన స్వామి వారు నాలుగు మాడవీధులలో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు, కోలాటాలు, డప్పు నృత్యాలు, సంప్రదాయ వేష ధారణలతో వాహన సేవ ముందు ఆకట్టుకున్నాయి. రామావతారంతో ఆంజనేయునిపై ఆసీనులై విహరిస్తున్న స్వామి వారిని దర్శించునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.