Vandebharat Express: ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. రాష్ట్రానికి మరో రేపటి నుంచి వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. దీనిని విజయవాడ-చెన్న నడపాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు ఇది మూడో వందేభారత్ రైలు కానుంది. రేపు ఉదయం 10:30 గంటలకు జెండా ఊపి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచీ చెన్న్‌కి మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రేపు ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12:30కు విజయవాడ నుంచి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరనుంది. ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ చెన్నై వెళ్లనుంది. మొత్తం ప్రయాణానికి 6 గంటల 30 నిమిషాల సమయం పట్టనుంది. ఎలాంటి అలసట లేని ప్రయాణ సౌకర్యం వందేభారత్‌తో అందిస్తున్నామని రైల్వే అధికారులు చెబుతున్నారు.
Also Read: Tirumala: వైభవంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. స్వర్ణరథంపై ఉభయదేవేరులతో గోవిందుడు
ఇదిలా ఉండగా.. రేపు ప్రధాని నరేంద్రమోడీ 11 రాష్ట్రాలకు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 9 కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించనున్నారు. ఈ రాష్ట్రాల్లోని మతపరమైన, పర్యాటక ప్రాంతాలను ఈ రైళ్లు కలపనున్నాయి. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమ బెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రయాణికులు మరింత వేగంగా గమ్యస్థానాలకు చేరేందుకు కొత్తగా ప్రారంభించే వందేభారత్ రైళ్లు సహాయపడనున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రైళ్లును జెండా ఊపి ప్రారంభించనున్నారు. రైల్వేలో ఆధునాతన ఫీచర్లను జోడించడంతో పాటు ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చేందుకు భారత్ రైల్వే వందే భారత్ రైళ్లను తీసుకువచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే రెండు వందేభారత్ రైళ్లు ప్రజలకు సేవలు అందిస్తున్నాయి. సికింద్రాబాద్ – విశాఖ, సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ఈ సంవత్సరమే ప్రధాని మోడీ వందేభారత్ రైళ్లు ప్రారంభించారు. ఇప్పుడు మూడో ట్రైన్ రేపు వస్తోంది. ఈ రెండు రైళ్లకు పెరుగుతున్న ఆదరణ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వందేభారత్ రైళ్ల నిర్వహణ దిశగా రైల్వే శాఖ కసరత్తు చేసింది. ఈ వందేభారత్ ట్రైన్ షెడ్యూల్‌ను కూడా రైల్వే అధికారులు విడుదల చేశారు.
వందేభారత్ రైలు షెడ్యూల్ ఇదే..