ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి చెందిన గుంటూరు కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు 30 మందిని అరెస్ట్ చేశారు. నిందితులను వైద్య పరీక్షల అనంతరం కోర్టుకు తరలించారు. మంత్రి కార్యాలయంపై దాడి చేసిన వారు టీడీపీ-జనసేన కార్యకర్తలు అని పోలీసులు తెలిపారు.
వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వెల్లడించారు. త్వరలో వైఎస్.రాజశేఖరరెడ్డి తనయురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నట్లు అధిష్టానం నుండి సమాచారం ఉందని తెలిపారు.
గుంటూరులో మంత్రి రజని కార్యాలయంపై దాడి చేయడం దుర్మార్గమని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఆఫీస్ మీద రాళ్లు వేసి ఫ్లెక్సీలు చింపివేసి టీడీపీ శ్రేణులు రౌడీయిజం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ వాళ్లు ఫ్రీ ప్లాన్‌డ్‌గా చేసిన చర్య ఇది అంటూ ఆయన ఆరోపించారు. మంత్రి విడుదల రజిని కార్యాలయంపై దాడి చేయడం హింసను ప్రేరేపించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ సీరియస్ అయింది. విశాఖ జిల్లా గ్యాంగ్ రేప్ ఘటనపై మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాంగ్ రేప్ ఘటన కేసును మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
చంద్రబాబు నాయుడిపై ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, డ్వాక్రా మహిళల రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
నూతన సంవత్సర వేడుకలు ముగ్గురు యువకుల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఏలూరు జిల్లాలో న్యూఇయర్ రోజున విషాదం చోటుచేసుకుంది. అగిరిపల్లి మండలం కనసానపల్లిలో మద్యం మత్తులో బుల్లెట్ బండి నడుపుతూ బావిలోకి దూసుకెళ్లాడు ఓ యువకుడు. బుల్లెట్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
కాకినాడ జిల్లాలోని తునిలో న్యూఇయర్ వేడుకల్లో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. న్యూఇయర్ వేడుకల్లో టీడీపీ శ్రేణుల మధ్య గొడవ జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తునిలోని సాయి వేదిక ఫంక్షన్ హల్‌లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు.
నీతి నిజాయితిపరులే రాజకీయాల్లోకి రావాలి అంటూ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సంపాదన కోసం కొంత మంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్‌గా మారిందన్నారు.
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ యూఎస్ఏ సోషల్ మీడియా కమిటీని నియమించారు. ఈ సోషల్ మీడియా కమిటీకి కన్వీనర్‌గా గంగిరెడ్డిగారి రోహిత్‌ని నియమించారు.
ఒక్క బిర్యానీ తిని ఏడు లక్షల రూపాయల కారు గెలుచుకున్నాడు ఓ లక్కీ ఫెలో. తిరుపతి నగరంలోని రోబో హోటల్లో నిర్వహించిన బిర్యాని లక్కీ డ్రా లో రాహుల్ అనే వ్యక్తి నిస్సాన్ మాగ్నట్ కారు ఉచితంగా పొందాడు.