Ambati Rayudu: ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం అంబటి రాయుడికి పవన్ కళ్యాణ్ వినాయకుడి వెండి ప్రతిమను బహూకరించారు. ఇదిలా ఉండగా.. ఈ సమావేశం వివరాల గురించి అంబటి రాయుడు తన ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్‌లో తెలిపారు. పవన్‌కళ్యాణ్‌ను ఎందుకు కలిశాననే విషయంపై స్పష్టత ఇచ్చారు. వైసీపీని వీడుతున్నానని, రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని ఆయన ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఓ నిర్ణయం తీసుకునే ముందే పవన్ కలవాలని తన శ్రేయోభిలాషులు చెప్పాలని అంబటి రాయుడు చెప్పారు. అందుకే తానే పవన్‌కళ్యాణ్‌ను కలిశానని చెప్పారు.
Read Also: Chandrababu: అమరావతి రాజధానిగా ఉంటుంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
“స్వచ్ఛమైన హృదయంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాను. నా ఆలోచనలు, కలలు సాకారమవుతాయని వైసీపీలో చేరాను. అనేక గ్రామాలను సందర్శించి చాలా మంది ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అర్థం చేసుకున్నాను. వ్యక్తిగతంగా వాటి పరిష్కారానికి నా వంతు కృషి చేశాను. చాలా సామాజిక సేవ చేశాను. కొన్ని కారణాల వల్ల వైసీపీతో నేను లక్ష్యాలను సాధించలేనని అర్థమైంది. ఇందులో ఎవరినీ తప్పుపట్టడం లేదు. నా భావజాలం, వైసీపీ సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఫలానా స్థానం అని అనుకోలేదు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాను. సరైన నిర్ణయం తీసుకునే ముందు పవన్‌ను కలవమని నా శ్రేయోభిలాషులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు సలహా ఇచ్చారు. జీవితం, రాజకీయాలతో పాటు పవన్‌ను అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించా. మా ఇద్దరి ఆలోచనల్లో సారూప్యత కనిపించింది. జనసేన అధినేత పవన్‌ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నా. క్రికెట్ కోసం త్వరలోనే దుబాయ్ వెళ్తున్నా. ఎక్కడ ఉన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అండగా ఉంటా..” అని అంబటి రాయుడు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.
— ATR (@RayuduAmbati) January 10, 2024