Tiger Hulchul: ఏలూరు జిల్లాలో పులి కలకలం.. భయాందోళనలో ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Hulchul: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దేవినేనివారి గూడెంలో పెద్దపులి సంచారం హడాలెత్తిస్తోంది. అర్ధరాత్రి సమయంలో గ్రామంలోని రెండు ఆవులు, ఒక దూడపై పులి దాడి చేసింది. తెల్లవారుజామున పొలంలోకి వెళ్లిన రైతులు గాయపడిన ఆవులను చూసి పులి దాడి జరిగినట్టుగా గుర్తించారు. ఘటనా స్థలంలో పులి పాదముద్రలు గుర్తించారు. దెందులూరు, ద్వారకాతిరుమల, నల్లజర్ల మండలాల్లో పులి ఎక్కువగా సంచరిస్తుంది. పులి కదలికలను గుర్తించేందుకు ఇప్పటికే అటవీశాఖ అధికారులు ఆరు బృందాలుగా గాలిస్తున్నారు. రోజుకు 40 కిలోమీటర్ల పరిధిలో పులి సంచారం కొనసాగడంతో బోను ఏర్పాటు చేసేందుకు అనువైన ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. పులి సంచారంతో స్థానిక ప్రజల్లో భయాందోళన నెలకొంది. పొలాలకు వెళ్లాలంటే రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పులిని త్వరగా బంధించాలని అధికారులను కోరుతున్నారు.
Read Also: Pending Challans: మూడురోజులే గడువు.. పెండింగ్ చలాన్లు కట్టని వారు కట్టేయండి బాబు..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వాసులను పెద్దపులి హడలెత్తిస్తోంది. ఒక్కోచోట ఒక్కోరకంగా పులి పాదముద్రలు.. సంచరించేది పెద్దపులి ఒక్కటేనా.. రెండా అనే అనుమానం కలుగుతోంది. గత వారం రోజులుగా బుట్టాయిగూడెం, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దెందులూరు మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం. నిన్న దెందులూరు మండలం మేదినరావుపాలెంలో పులి పాదముద్రలను రైతులు గుర్తించారు.రైతులు వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించారు. పాదముద్ర ఆధారంగా పెద్దపులి సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. 13 సెంటీమీటర్ల పైగా పాదముద్రలు ఉంటే పులి సంచారం ఉన్నట్టు నిర్ధారిస్తారు. నాలుగు రోజుల క్రితం నల్లజర్ల మండలం పుల్లలపాడులో ఆవు దూడలపై పులి దాడి చేసింది. అనంతరం ద్వారకాతిరుమలలో మండలంలో ఆవులపై దాడి చేసి తినేసింది. రాత్రి మరోసారి ద్వారకాతిరుమల మండలం దేవినేని వారి గూడెంలో ఆవులపై పులి దాడి చేసింది
ఒక్కోచోట ఒక్కోరకంగా పాదముద్రలు ఉండడంతో… సంచరించేది ఒక్కటేనా లేక రెండా అనే అనుమానం కలుగుతోంది. పోలవరం కుడికాలువ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి ఎక్కువగా సంచరిస్తున్నట్లు తెలిసింది. గడిచిన వారం రోజుల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో పులి సంచరిస్తోంది.ఇప్పటికే పెద్దపులి జాడ తెలుసుకునేందుకు ఆరు బృందాలుగా ఏర్పడి అటవీ శాఖ సిబ్బంది గాలిస్తున్నారు. పులి సమాచారం కోసం అటవీ సిబ్బంది టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పశువుల పాక దగ్గర వెలుతురు ఎక్కువ వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!