నేడు విశాఖకు సీఎం జగన్.. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖలో పర్యటించనున్నారు. సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించడానికి భీమిలీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు దాదాపు 34 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, గృహసారథులు రావాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 గంటలకు వైజాగ్ చేరుకోనున్న సీఎం జగన్ భీమిలీ సంగివలసలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలకు దిశానిర్థేశం చేయనున్నారు. పార్టీ శ్రేణులతో ఆయన మాటమంతి నిర్వహిస్తారు. అయితే, ఉత్తరాంధ్రలోనే వైసీపీ ఎన్నికల శంఖారావం నిర్వహిస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ రేపుతుంది. ఈ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారు. ఇక, సభాప్రాంగణం వెనుక నుంచి జగన్ కాన్వాయ్ రావడానికి వీలుగా ఏర్పాటు చేశారు. అలాగే, సభాప్రాంగణం చదును, హెలిప్యాడ్ ను సైతం అధికారులు సిద్ధం చేశారు. దీంతో ఈ సభ ద్వారా వైసీపీ ఎన్నికల శంఖారావం ప్రకటించనుంది.
నేడు ఉరవకొండ చంద్రబాబు.. ‘రా.. కదలిరా’ పేరుతో పర్యటన..
నేడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉరవకొండలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘రా.. కదలిరా’ సభ నిర్వహించనున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు చంద్రబాబు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకొని.. 11:15 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా ఉదయం 11:50 గంటలకు పీలేరుకు చేరుకోనున్నారు. పీలేరులో 11:50 నుంచి మధ్యాహ్నం 1:30 వరకూ చంద్రబాబు ‘రా.. కదలిరా’ సభలో పాల్గొంటారు. ఆ వెంటనే రోడ్డు మార్గం ద్వారా పీలేరు మండలంలోని వేపులబైలు గ్రామానికి చేరుకోనున్నారు. ఇక అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు ఉరవకొండ మండలంలోని లతవరం చేరుకోని.. అక్కడ సాయంత్రం 5:30 వరకూ చంద్రబాబు సభ నిర్వహిస్తారు. ఇక అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు ఉరవకొండ మండలంలోని లతవరం చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 5:30 వరకూ టీడీపీ నిర్వహించే రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.
నేడు మూడు జిల్లాలో ఏపీసీసీ చీఫ్ షర్మిల పర్యటన..
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మూడు జిల్లాల్లో పర్యటించబోతున్నారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆమె సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించనున్నారు..
ఖమ్మం జిల్లాలో భట్టి విక్రమార్క పర్యటన..
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇవాల ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మధిర నియోజకవర్గంలోని మధిర చింతకాని మండలాలలోపలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు. మధిర మండలం బయ్యారంలో గ్రామ పంచాయతీ భవనం, చిలుకూరులో పాఠశాల భవనం, నిదానపురం, మాటూరులో ఆరోగ్య ఉపకేంద్రాలు, చింతకాని మండలం నాగులవంచలో రైతు వేదిక, చిన్నమండవలో ఆరోగ్య కేంద్రం, వాటర్ ప్లాంట్, డైనింగ్ హాల్‌ను భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. నాగులవంచ ప్రభుత్వ పాఠశాలలో, కోడుమూరులోని గ్రామ పంచాయతీ భవనం, విద్యుత్ సబ్ సెంటర్లలో. అలాగే సాయంత్రం 6 గంటలకు చింతకానిలో జరిగే అభినందన సభలో భట్టి పాల్గొంటారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఖమ్మం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు ఖమ్మంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి సాయంత్రం 4 గంటలకు రఘునాధపాలెం మండలం మంచుకొండలో ఆరోగ్య ఉపకేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఖమ్మం రూరల్ మండలం పెదతండా ప్రియదర్శిని కళాశాలలో జరుగుతున్న సృజనోత్సవ్‌కు మంత్రి హాజరవుతారు.
రేపు తెలంగాణకు అమిత్ షా.. ఒకే రోజు 3 జిల్లాల్లో పర్యటన..!
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణపై బీజేపీ నాయకత్వం దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా… వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. 2019 ఎన్నికల్లో ఏకంగా నలుగురు ఎంపీలను గెలిపించి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సవాల్ విసిరింది. ఆ తర్వాత బీజేపీ క్రమంగా పుంజుకుంది. అయితే మరోసారి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగా… ఆ పార్టీ అగ్రనేత అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. మూడు జిల్లాల్లో జరిగే కీలక సమావేశాల్లో వీరు పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ నుంచి ఎన్నికల గ్యాప్‌ను బీజేపీ పూరించనుంది. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కేంద్రమంత్రి అమిత్ షా ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా మహబూబ్‌నగర్ వెళ్లారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరవుతారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని పార్టీ నేతలు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత కరీంనగర్ వెళ్లి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు.
లేడీస్ హాస్టల్ లో చొరబడి ఇద్దరు యువకులు.. సికింద్రాబాద్ లో ఘటన
సికింద్రాబాద్ పీజీ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ లో ఇద్దరు ఆగంతకులు చొరబడిన ఘటన కలకలం రేపుతోంది. అర్దరాత్రి ఉమెన్స్ హాస్టల్ లో ఇద్దరు ఆగంతకులను గుర్తించిన విద్యార్థినిలు గట్టిగా కేకలు వేశారు. వారిని పట్టుకునేందుకు విద్యార్థినులు పరుగులు పెట్టారు. అయితే ఇద్దరు ఆగంతకుల్లో ఒకరు అక్కడి నుంచి తప్పించుకుని హాస్టల్ నుంచి పరార్ అయ్యాడు. అయితే ఒకరు ఆగంతకున్ని పట్టుకున్న విద్యార్థినిలు దేహశుద్ధి చేశారు. ఆగంతకుని అక్కడే కట్టేసి విద్యార్థులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటా హుటిన పీజీ కాలేజ్ ఉమెన్స్ హాస్టల్ క్యాంపస్ కు వచ్చారు. ఆగంతుకుని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించకుండా విద్యార్థినిలు అడ్డుకుంటున్నారు. తమకు న్యాయం జరిగే వరకు తీసుకుపోవద్దంటూ పోలీసు వాహనాలకు విద్యార్థినులు అడ్డంగా కూర్చున్నారు. వాహనాలు కదిలించేది లేదని భీష్మించుకుని ఆందోళన కొనసాగిస్తున్నారు. దీంతో పీజీ ఉమెన్స్ ఉమెన్స్ కాలేజ్ క్యాంపస్ కి రిజిస్టార్ వచ్చారు. రిజిస్టార్కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు విద్యార్థినిలు.
బడ్జెట్లో మధ్యతరగతి ప్రజల ఈ 4 అంచనాలు నెరవేరుతాయా ?
దేశం 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. మరి కొద్ది రోజుల తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మధ్యంతర బడ్జెట్‌లో పెద్ద మార్పులు చేసే సంప్రదాయం లేనప్పటికీ, దేశంలోని మధ్యతరగతి ఈ బడ్జెట్‌పై ఈ 4 అంచనాలను కలిగి ఉంది. భారతదేశంలో మధ్యతరగతి నిరంతరం పెరుగుతోంది. దేశం ఆర్థిక వృద్ధికి ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి రకమైన మార్కెట్‌ను ముందుకు తీసుకెళ్లడంలో మధ్యతరగతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారి అంచనాలను నెరవేరుస్తారో లేదో చూడాలి. గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘కొత్త పన్ను విధానం’ కింద పన్ను రహిత ఆదాయ పరిమితిని రూ. 7.5 లక్షలకు పెంచారు. అయితే పాత పన్ను విధానంలో ఎలాంటి మార్పులు చేయలేదు. పాత పన్ను విధానంలో ప్రజలు వివిధ రకాల పొదుపులు, గృహ రుణాలు మొదలైన వాటిపై పన్ను మినహాయింపును పొందారు. మధ్యతరగతిలో పొదుపు చేయడానికి పన్ను మినహాయింపు కూడా ఒక సాకు. ఈసారి ప్రభుత్వం పన్ను, గృహ రుణం మొదలైన వాటికి సంబంధించిన మినహాయింపు పరిమితిని పెంచుతుందని ఆయన భావిస్తున్నారు.
ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు సజీవ దహనం.. ఇద్దరికి గాయాలు
రాజధాని ఢిల్లీలోని షహదారాలో ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వీధి నంబర్ 26లోని ఓ ఇంటి కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక శాఖ సమాచారం ప్రకారం.. 6:55 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి. అదే సమయంలో ఇంట్లో చిక్కుకుపోయిన కొంతమందిని కూడా బయటకు తీశారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో వైపర్ రబ్బర్ కటింగ్ ఫ్యాక్టరీ నడుస్తుంది. ప్రజలు పై అంతస్తులలో నివసిస్తున్నారు. మొదట గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి వేగంగా మొదటి అంతస్తుకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఆరుగురిలో నలుగురు మరణించారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. 17 ఏళ్ల బాలుడు, ఏడాది వయసున్న చిన్నారి ఉన్నాడు.
అమెజాన్, గూగుల్ తర్వాత 700మంది ఉద్యోగులను తొలగించిన మరో టెక్ కంపెనీ
2024 సంవత్సరం ప్రారంభంతో అనేక టెక్ కంపెనీలలో తొలగింపుల ప్రక్రియ (టెక్ లేఆఫ్స్ 2024) ప్రారంభమైంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, పెద్ద టెక్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ తాజా రౌండ్ లేఆఫ్‌లలో (సేల్స్‌ఫోర్స్ లేఆఫ్స్ 2024) దాదాపు 700 మంది ఉద్యోగులను అంటే ఒక శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. దీనికి ముందు, అమెరికన్ టెక్ కంపెనీలు అమెజాన్, గూగుల్ మొదలైనవి కూడా సంవత్సరం ప్రారంభంలో పెద్ద ఎత్తున తొలగింపులను ప్రకటించాయి. సేల్స్‌ఫోర్స్ భారతదేశంలో కూడా పనిచేస్తుంది. దాని కార్యాలయాలు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణె, జైపూర్‌లలో ఉన్నాయి. గత ఏడాది జనవరిలో కంపెనీ తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్ (సేల్స్‌ఫోర్స్ లేఆఫ్స్)లో 10 శాతం మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. దీని తరువాత, సెప్టెంబర్ 2023 లో కంపెనీ 3,000 మంది నియామకాలను కూడా ప్రకటించింది. Layoffs.fyi ప్రకారం.. తొలగింపుల డేటాను ట్రాక్ చేసే పోర్టల్ 2024 ప్రారంభం నుండి ప్రపంచవ్యాప్తంగా 85 కంటే ఎక్కువ టెక్ కంపెనీలు 23,770 మంది ఉద్యోగులను తొలగించాయి.
లంగా ఓణిలో శ్రీలీలా ఎంత అందంగా చూశారా?.. బాపు బొమ్మే..
ప్రస్తుతం టాలివుడ్ లో శ్రీలీల పేరుకు యమ క్రేజ్ ఉంది.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. అతి తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా టాక్ ను సొంతం చేసుకుంది.. తన టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతుండటంతో ఈ బ్యూటీ కెరీర్ దూసుకుపోతోంది.. రెండు మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిందో లేదో ఈ ముద్దుగుమ్మ టాలెంట్ కు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలా గ్యాప్ లేకుండా షూటింగ్స్ కు హాజరవుతోంది.. ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం అభిమానులను పలకరిస్తూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది… తాజాగా షేర్ చేసిన క్యూట్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. హాఫ్ శారీలో ఆమె ఇచ్చిన బ్లాస్టింగ్ ఫోజులు.. కుర్రాళ్ల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. లేలేత నడుము మడతలు లేకుండా.. అలా ఒంపు తిరిగి కనిపిస్తుంటే.. నెటిజన్లకు నిద్ర పట్టడం. కుర్ర భామ భంగిమలకు తట్టుకోలేక పోతున్నారు. రవితేజ ‘ధమాఖా’తో పాటు బాలయ్యతో భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్ లను అందుకున్న విషయం తెలిసిందే. ఆదికేశవ నిరాశ పరిచిన గుంటూరు కారం సినిమాతో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. శ్రీలీలాకు అతి తక్కువ సమయంలో బాలయ్య, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ రావడం విశేషం. ఇప్పుడే ఈ స్థాయిలో శ్రీలీలా ఊపుతుందంటే.. మున్ముందు ఏ స్థాయిలో సంచలనం సృష్టించబోతోందో అని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..