తిరుమలలో శ్రీవెంకటేశ్వర ధార్మిక సదస్సు ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన సదస్సులో 62 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సూచనలు, సలహాలు ఇచ్చారు. మూడు రోజులు పాటు జరిగిన ధార్మిక సదస్సులో అనేక తీర్మానాలు చేశామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి గవర్నర్ ప్రసంగించారు. విజయవాడలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించామని.. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ తెలిపారు.
ఇచ్చిన హామీలు అమలు చేయదని టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ఇచ్చిన హామీలను అమలు చేసిన ఏకైక సీఎం జగన్ అని ఆయన తెలిపారు. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు మేనిఫెస్టో లో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఒకేరోజు రెండుసార్లు భేటీకావడం, సుదీర్ఘంగా చర్చలు జరపడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. సీట్ల సర్దుబాటుపై ఫైనల్ చర్చల్లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం దాదాపు మూడు గంటలపాటు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పవన్ సమావేశమయ్యారు.
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉదయం 10 గంటలకు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఉభయసభలూ మంగళవారానికి వాయిదా పడతాయి. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం జరుగుతుంది.
ఉత్తరాంధ్రకు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింఙారావు గుడ్ న్యూస్ చెప్పారు. వాల్తేరు డివిజన్‌తో కూడిన రైల్వేజోన్ నిర్మాణం జరుగుతుందని ఆయన ప్రకటించారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ఆయన వెల్లడించారు.
కేశినేని నానిపై మరోసారి విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న. కేశినేని నాని దెబ్బకు వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పారని ఆయన అన్నారు. కేశినేని నాని దెబ్బకు వైసీపీలో ఓ వికెట్ పడిందన్నారు. కేశినేని నానికే డిపాజిట్ రాదు..అలాంటి నానితో మనకెందుకని వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి దూరంగా జరిగారని ఆరోపించారు.
విశాఖ జిల్లాలో తహశీల్దార్ రమణయ్య హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు వెలుగు చూస్తున్నాయి. అనంత శర్మ(పూజారి )అనే వ్యక్తి ఫోన్ చేయడంతో రమణయ్య ఇంటి నుంచి కిందకి వచ్చినట్లు తెలిసింది.