Andhrapradesh: వీఆర్ఏలకు డీఏను రూ.300 నుంచి 500కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి వెల్లడించారు. డీఎను పెంచుతూ ఆదేశాలు ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు. వాట్సప్ గ్రూపుల్లో తన పేరిట తప్పుగా ప్రచారం జరుగుతోందని.. రిటైర్మెంట్ రెండేళ్లు పెంచడం సహా పలు అంశాలతో ఫేక్ మెసేజ్ తిప్పుతున్నారని ఆయన పేర్కొన్నారు.
Read Also: Minister Peddireddy: ఇలాంటి దైర్యం చంద్రబాబు నాయుడు చేయగలరా…!
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదన్నారు. పదవీ విరమణ వయస్సు పెంచుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని, పీఆర్సీ, డీఏ బకాయిలు సైతం ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. వచ్చే వారంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు చర్చలు జరుపుతారని.. ఆ సమావేశంలో ఐఆర్ ప్రకటన సహా పలు డిమాండ్లపై ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభుత్వం 15-20 రోజులు మాత్రమే పని చేస్తుందని.. ఈ సమయంలో కొత్త పనుల కోసం ఉద్యోగులు ఎవరూ ప్రయత్నించవద్దని కోరుతున్నామన్నారు. ఉద్యోగులకు ప్రభుత్వం ఐఆర్ ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు.