CEO Review: ఏపీలో ఎన్నికల నిర్వహణపై సీఈఓ ఎంకే మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, ఓటర్ల జాబితాపై సీఈఓ సమీక్ష చేపట్టారు. ఓటర్ల నమోదు, మార్పు చేర్పుల దరఖాస్తుల పరిష్కారంపై ఫోకస్ పెట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. యువ ఓటర్లందరుకీ ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Read Also: EX MLA Jaleel Khan: బెజవాడ పశ్చిమ సీటు మైనార్టీలకు ఇవ్వాలి..
పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, అధికారులు, సిబ్బంది నియామకాలకు ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా సూచించారు. పోలింగ్ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణనివ్వాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పులు జరగ్గకుండా జాగ్రత్త పడాలన్నారు. ప్రాంతాల వారీగా పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ చేపట్టాలని సూచనలు చేశారు. నగదు, మద్యం అక్రమ రవాణాని అరికట్టాలని సీఈవో ఎంకే మీనా అధికారులను ఆదేశించారు.ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.