Minister RK Roja: మూడు సార్లు సీఎంగా చేస్తే, మ్యానిఫెస్టోలో పెట్టినవి అమలు చేశాను చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదని మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. మళ్లీ అవకాశం ఇవ్వండి అని సిగ్గులేకుండా అడుగుతున్నారని ఆమె తీవ్రంగా వ్యాఖ్యానించారు. కుటుంబాలను చీల్చడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ మండిపడ్డారు. నాడు ఎన్టీఆర్ కుటుంబంతో ప్రారంభమై నేడు వైఎస్ కుటుంబం వరకు వచ్చారన్నారు.
Read Also: Minister Peddireddy: ఇలాంటి దైర్యం చంద్రబాబు నాయుడు చేయగలరా…!
ఈ అవకాశం ఇచ్చిన షర్మిలది తప్పు అని ఆమె అన్నారు. వైఎస్ కుటుంబం మాట ఇస్తే నిలబడతారు అనే నమ్మకం ప్రజలలో ఉందన్నారు. వైఎస్సార్ ఆత్మ క్షోభించే విధంగా షర్మిల వ్యవహరిస్తున్నారని.. షర్మిల మెడలో కండువా కాంగ్రెస్‌ది, మాట్లాడుతున్న స్క్రిప్ట్ చంద్రబాబుది అంటూ ఆమె ఆరోపించారు. చంద్రబాబు నాయుడుకు పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తరిమేసిన నాయకులని అభ్యర్థులుగా పెట్టుకునే పరిస్థితికి దిగజారారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. నగరి నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదు అంటున్న నాయకులకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. నగరి నియోజకవర్గంలో అభివృద్ధి వచ్చి చూస్తే కళ్ళకు కనిపిస్తుందన్నారు.