GVL Narasimha Rao: ఉత్తరాంధ్రకు బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింఙారావు గుడ్ న్యూస్ చెప్పారు. వాల్తేరు డివిజన్‌తో కూడిన రైల్వేజోన్ నిర్మాణం జరుగుతుందని ఆయన ప్రకటించారు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని ఆయన వెల్లడించారు. జీజేపీ నాయకత్వం నిరంతర ప్రయత్నాలు ఫలితంగా కేంద్రం సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కంట్లో కారం కొడితే విభజన హామీలను 100శాతం పూర్తి చేసింది బీజీపీ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Buddha Venkanna: కేశినేని నానిపై మరోసారి విరుచుకుపడిన బుద్దా వెంకన్న
రైల్వేజోన్ భూములపై వివాదం జరుగుతున్నసమయంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గుడ్ న్యూస్ చెప్పారు. వాల్తేర్ డివిజన్‌తో కూడిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు సాకారం అవుతోందని చెప్పారు. ఉత్తరాంధ్రలు ఆకాంక్షలు నెరవేర్చడం ఒక్క బీజెపీ నాయకత్వంతోనే సాధ్యం అంటున్నారు.