ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా.. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్ వి పొట్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేశినేని నానిపై మండిపడుతూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ ను గణేష్ కుటుంబ సభ్యులు ప్రశ్నించి నందుకు వారిపై కారుతో ఢీ కొట్టిన ఘటన సంచలనంగా మారింది. కారుతో గుద్దడమే కాకుండా వారిని 200 కిలోమీటలర్లు ఈడ్చెకెళ్లాడు. దీంతో బాధితులకు తీవ్ర గాయాలుకావడంతో వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దీనిపై గణేష్ కుటుంబ సభ్యులు ఎన్టీవీతో మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓ వైపు వర్షాలు పడుతుండగా.. మరోవైపు ఎండలు దడ పుట్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తుండగా.. చాలా మండలాల్లో ఎండలు, వడగాల్పులకు జనాలు అల్లాడిపోతున్నారు. భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండగా.. ప్రజలు వేడిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
నేటి నుంచి ఏపీలో వైఎస్సార్ పెన్షన్ కానుక పంపిణీని ప్రభుత్వం చేపట్టనుంది. 63.14 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1739.75 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం పింఛన్ల రూపంలో పంపిణీ చేయనుంది.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు కర్నూలు జిల్లా పత్తికొండలో పర్యటించనున్నారు. వరుసగా ఐదవ సంవత్సరం మొదటి దశ వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ యోజన మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. బటన్ నొక్కి రైతు భరోసా నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.