AP CM YS Jagan Guntur Tour: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా.. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్ల రాష్ట్ర స్ధాయి పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 9.30 గం టలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్ బయలుదేరనున్నారు. తొలుత గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని.. అక్కడ నుంచి చుట్టుగుంటకు వెళ్లనున్నారు. అక్కడ వైఎస్సార్ యంత్రసేవా పథకం మెగా మేళా-2లో భాగంగా.. రైతులకు ట్రాక్టర్లు, హార్వె స్టర్లు రాష్ట్రస్ధాయి పంపిణీ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించనున్నా రు. ఈ కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వా త జగన్ తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
చిన్న, సన్నకారు రైతులు ఎదుర్కొంటున్న కూలీల వెతలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైఎస్సార్ యంత్ర సేవా పథకం కింద శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న మెగామేళాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు చుట్టుగుంట సెంటర్ వద్ద ట్రాక్టర్లు, కంబైన్డ్ హార్వెస్టర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. వంద శాతం యంత్ర సేవా కేంద్రాల ఏర్పాటులో భాగంగా రూ.361.29 కోట్ల అంచనాతో 3,919 ఆర్బీకే, 100 క్లస్టర్ స్థాయి కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. ఎంపిక చేసిన రైతు గ్రూపుల బ్యాంకు ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ మొత్తాన్ని సీఎం బటన్ నొక్కి నేరుగా జమచేయనున్నారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, ఇతర యంత్ర పరికరాల పంపిణీ చేస్తారు.
Read Also: BREAKING NEWS : ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. నారా లోకేష్ పై కోడి గుడ్ల దాడి..
ఈ ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకే సన్న, చిన్న కారు రైతులకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వారికి సాగు వ్యయం తగ్గించి నికర ఆదాయం పెంచాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచనలకనుగుణంగా వైఎస్సార్ యంత్ర సేవా పథకానికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద రూ.15లక్షల విలువైన యంత్ర పరికరాలను ఆర్బీకే స్థాయిలోనూ, రూ.25లక్షల విలువైన కంబైన్డ్ హార్వెస్టర్‌తో కూడిన యంత్ర పరికరాలను క్లస్టర్ స్థాయిలోనూ ఏర్పాటుచేస్తోంది. పంటల సరళి, స్థానిక డిమాండ్‌కు అనుగుణంగా కావాల్సిన యంత్ర పరికరాల ఎంపిక, కొనుగోలుతో పాటు వాటి నిర్వహణ బాధ్యతలను కూడా రైతు గ్రూపులకే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. యంత్ర పరికరాలు, వాటి అద్దె వివరాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. కనీసం 15 రోజుల ముందుగా మండల పరిధిలో ఏ ఆర్బీకే నుంచైనా బుక్ చేసుకునేందుకు వీలుగా ‘వైఎస్సార్ సీహెచ్‌సీ’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు, గ్రూపులకు వచ్చే ఆదాయం, రుణాల చెల్లింపు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ వీటి నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు రాష్ట్రస్థాయిలో డాష్ బోర్డునూ ఏర్పాటుచేశారు.