ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పోలవరం పర్యటనకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6న పోలవరం ప్రాజెక్టును జగన్ సందర్శించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంపై అధికారులకు కీలక సూచనలు చేయనున్నారు. సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో అమరావతి నుంచి ఉదయం 10.15 గంటలకు పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకుంటారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. చాలా కాలం అనంతరం చంద్రబాబు అమిత్ షాతో భేటీ కావడం, ఇవాళ ప్రధాని మోదీని కలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
రతదేశంలోని 23 ఐఐటీలలో బీటెక్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ప్రారంభమైంది. జరగనుంది. భారతదేశ వ్యాప్తంగా ఏకంగా రెండు లక్షల మంది పోటీ పడుతుండగా.. మన తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 35 వేల మంది ఈ పరీక్ష రాస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు సెగలు కక్కుతున్నాడు. వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల ప్రభావానికి రాష్ట్రంలో మరోమారు తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
చంద్రబాబు, లోకేష్ తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని.. చంద్రబాబు మాటలు పగటి కలల్లా ఉంటాయని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు.
ఆపరేషనల్ కారణాల వల్ల విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. నేటి నుంచి 9వ తేదీ వరకు 12 రైళ్లను రద్దు చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.