శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదిరా తిరుపతిలో భక్తుల రద్దీ బాగా ఉంది. ఎందుకంటే వేసవి సెలవులు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా టీటీడీ అధికారులు మరియు సిబ్బంది అన్ని రకాల చర్యలను తీసుకుంటూ ఉన్నారు. సోమవారం శ్రీవారి భక్తులతో తిరుమల ఎంతో రద్దీగా ఉంది. మే 29వ తేదీ సోమవారం అర్ధరాత్రి వరకు 78 వేల మంది పై గా…
చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ మహానాడును నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి నాలుగు లైన్ల జాతీయ రహదారి చెంతనే శుక్ర, శనివారాల్లో ఈ మహానాడును అద్భుతంగా చేపట్డనున్నారు.
అసలే పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. బండికి పెట్రోల్ కొట్టించుకోలేక చాలామంది ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. కొంతమంది పెట్రోల్ బైకులను పక్కనపెట్టి బ్యాటరీ వాహనాలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ సమయంలో పెట్రోల్ ఫ్రీగా వస్తుందంటే ఎవరైనా వదులుతారా. రండి బాబు రండి అని చెప్పగానే… వందలాది వాహనాలు క్యూ కట్టాయి.
రాజధానిలో పేదలకు ఇళ్లిచ్చే అద్భుతమైన కార్యక్రమం దేశ చరిత్రలోనే ప్రత్యేకమని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. దేశంలో పేదలకు ఇల్లు కావాలని అనేక పోరాటాలు చూశామన్నారు. కానీ పేదలకు ఇల్లు ఇవ్వడానికి సుదీర్ఘ న్యాయ పోరాటం చేయాల్సి వచ్చిందని.. యాభై వేల మందికి ఇల్లు ఇస్తామంటే మారీచులు ,రాక్షసులు లాంటి ప్రతిపక్షాలు అడ్డు పడ్డాయని ఆయన మండిపడ్డారు.
ఏపీలోని రైతులకు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా పథకం నిధులను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేయనున్నారు. అన్నదాతలకు తొలి విడత పెట్టుబడి సాయం అందించనుంది. అలాగే ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రధాని అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొననున్నారు.