హెడ్ కానిస్టేబుల్ కారు ఘటన.. బాధితులు ఏమన్నారంటే..
హెడ్ కానిస్టేబుల్ జ్ఞానేశ్వర్ ను గణేష్ కుటుంబ సభ్యులు ప్రశ్నించి నందుకు వారిపై కారుతో ఢీ కొట్టిన ఘటన సంచలనంగా మారింది. కారుతో గుద్దడమే కాకుండా వారిని 200 కిలోమీటలర్లు ఈడ్చెకెళ్లాడు. దీంతో బాధితులకు తీవ్ర గాయాలుకావడంతో వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దీనిపై గణేష్ కుటుంబ సభ్యులు ఎన్టీవీతో మాట్లాడుతూ.. ఇళ్ళు అమ్ముకొని వెళ్ళిపోవాలన్న టార్గెట్ తో వారిపై దాడి చేస్తున్నారని కన్నీరుమున్నీరయ్యారు. ఫిర్యాదు చేయడానికి పోతే పోలీస్ స్టేషన్ బయట అక్కడి పోలీసులు సమక్షంలోనే తన భర్త గణేష్ తో పాటు తన కొడుకు పై దాడి చేశారని వాపోయారు. తన కొడుకును చంపడానికి ప్రయత్నం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఇళ్ళు తగలబెడుతాము, మిమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని చంపడానికి ఇరువై మంది మీద పడ్డారని, తప్పించుకోవడానికి కారులో వెళ్ళామని అన్నారు. మమ్మల్ని వెళ్ళనీయకుండా కారుకు అడ్డుపడ్డారని, ప్రాణ భయంతోనే కారును అలాగే తీసుకెళ్ళామమని తెలిపారు. లేకపోతే మా ఇంట్లో ఒకరు ఈ రోజు ఉండేవాళ్ళు కాదని కన్నీరు పెట్టుకున్నారు. డిపార్ట్మెంట్ లో తన భర్త ఉన్నప్పటికి వారికి న్యాయం జరగడం లేదని కన్నీరుమున్నీరయ్యారు. మాకు ప్రాణ హాని ఉంది, రక్షణ కల్పించండంటూ వేడుకున్నారు.
ఇదే పని ముందే చేసి ఉంటే.. అంబర్ పేట చిన్నారి ప్రాణాలు దక్కేవే..
సంతోష్ నగర్ కాలనీలో ఐదేళ్ల బాలుడిపై వీది కుక్క దాడి ఘటనతో జీహెచ్‌ఎంసీ అధికారులు అలర్ట్ అయ్యారు. పాతబస్తీలో కుక్కలను పట్టుకునే ప్రక్రియను మరింత వేగవంతం చేశారు. ఉదయం నుంచి సంతోష్ నగర్ పరిసరాల్లో స్పెషల్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.. వీధి కుక్కల పరుగెడుతుంటే వాటి వెంటపడి పట్టుకుంటున్నారు. కుక్కల కోసం అన్నీ వీధులు, కాలనీల్లో తిరుగుతున్నారు. వారిని చూసి వీధి కుక్కలు పారిపోతున్నాయి ఎక్కడ వీధి కుక్కలు కనపడినా పరుగులు పెడుతూ వాటిని బంధిస్తున్నారు. అయితే జీహెచ్ ఎంసీ చేస్తున్న పనికి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే పని ఇంతకుముందే చేసి ఉంటే.. అంబర్ పేటలో చిన్నారి ప్రాణాలు దక్కేవే అంటున్నారు. అంతా అయిపోయాక.. ఇప్పుడు ఏం చేసి ఏం లాభం అని కొందరు విమర్శిస్తుంటే.. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచారని మరికొందరు అంటున్నారు. ఎట్టకేలకు జీహెచ్ ఎంసీ ఇప్పటికైనా స్పందించిందని అంటున్నారు. ఇదేమని ముందే చేసి ఉంటే ఇప్పటి వరకు కుక్కల దాడికి బలైన వారి సంఖ్య ఉండేది కాదని చెబుతున్నారు.
భయానక ఘటన.. రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా కాలు జారి మధ్యలో ఇరుక్కుని..
రైల్వే స్టేషన్లలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కదులుతున్న ట్రైన్స్ ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు ప్రయాణికులు అదుపుతప్పి పడిపోవడం జరుగుతూ ఉంటాయి. ప్లాట్‌ఫాం పై నుంచి పట్టాలపై పడిపోవడం లాంటి ఘటనలు కూడా రైల్వే స్టేషన్లలో సర్వ సాధారణంగా మారుతున్నాయి. రైలు ఎక్కేప్పుడు లేదా దిగేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నా కానీ ప్రయాణికులు మాత్రం రైల్వే అధికారుల మాటలను పెడిచెవిన పెడుతుంటారు. అలా అని ప్రమాదానికి గురవుతుంటారు. రైలు కదిలేప్పుడు చాలా మంది ప్రయాణికులు హడావిడిగా ఎక్కేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆ హడావిడే వారి జీవితాలకు హరించి వేస్తుందని మాత్రాం అలోచించరు. ఇలాంటి ఘటనే ఖమ్మంలో చోటుచేసుకుంది. ఆరోగ్యం భాగాలేక ఖమ్మంకు వచ్చిన జంటపై విధి వక్రీకరించింది. రైలు ఎక్కుతున్న భార్య భర్తలకు రైలు రూపంలో తీవ్ర విషాదాన్ని నింపింది. భర్త రైలు ఎక్కగా.. భార్య రైలు ఎక్కతున్న క్రమంలో రైలు కదిలింది దీంతో ఆమె కాలు కిందికి జారడంతో కాలు నుజ్జ నుజ్జ అయింది. అక్కడున్న పోలీసుల సహకారంతో ఆమె ప్రాణాలతో బయట పడింది.
సిద్దిపేటలో రైలు కూత వినిపించాలి.. అధికారులకు మంత్రి ఆదేశం
సిద్దిపేట శివారు మందపల్లి నుంచి రైల్వే ట్రాక్ లైన్ పనులను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైలు త్వరితగతిన సిద్దిపేటకు చేరుకునేలా రైల్వే ట్రాక్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. సిద్దిపేట రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రైల్వే శాఖ అధికారులు కాంట్రాక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో భాగంగా చేపట్టిన ట్రాక్ నిర్మాణ పనులను రైల్వే అధికారులు మంత్రికి వివరించారు. దుద్దెడ-సిద్దిపేట రైల్వే ట్రాక్ పనుల్లో భాగంగా మందపల్లి వద్ద అండర్‌పాస్ వంతెన నిర్మాణంలో జాప్యంపై మంత్రి హరీశ్‌రావు ఆరా తీసి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని రైల్వేశాఖ అధికారులను ఆదేశించారు.
బస్సును ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి..
చిత్తూరు జిల్లా తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడికే ప్రాణాలను.. తిరుపతి జిల్లాలో ఏర్పేడు మండలం మేర్లపాక చెరువు వద్ద ఆర్టీసీ బస్సును కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో చిన్నారి సహా దంపతులు మృతిచెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లె వాసులుగా గుర్తించారు.. ఈ ప్రమాదం పై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.. పరిస్థితిని పరిశీలించి కేసును నమోదు చేసుకున్నారు.. ఈ ఘటన కారణం అని పోలీసులు తెలిపారు.. వేగంగా కారును నడుపుతున్న సమయంలో అటుగా బస్సు రావడంతో కంట్రోల్ చెయ్యలేక బస్సును ఢీ కొట్టినట్లు పోలీసులు వెల్లడించారు.. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది.. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ప్రస్తుతం వైద్యాన్ని అందిస్తున్నారు.. అందులో ఒకరికి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.. ఈ ఘటన పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో వర్షాలు!
ఆంధ్రప్రదేశ్‌లో భిన్నమైన వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓ వైపు వర్షాలు పడుతుండగా.. మరోవైపు ఎండలు దడ పుట్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తుండగా.. చాలా మండలాల్లో ఎండలు, వడగాల్పులకు జనాలు అల్లాడిపోతున్నారు. భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండగా.. ప్రజలు వేడిని తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏపీలో ఎండ ప్రతాపంతో పాటు తీవ్ర వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు రావడం లేదు.అయితే నేడు, రేపు కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొననున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనుండగా.. పలుచోట్ల వర్షాలు కూడా కురవనున్నాయి. ఏపీ నుంచి తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ద్రోణి కొనసాగుతోంది. పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు మరఠ్వాడా, కర్ణాటక మీదుగా మరో ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో గురువారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, శ్రీ సత్యసాయి, నంద్యాల జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.
యూనిఫాంతో ఉన్న విద్యార్థులకు బస్‌లో ఫ్రీ.. ఎక్కడంటే..
బస్సులో ప్రయాణం చేయాలంటే టికెట్ తీసుకోవాలి.. లేదంటే బస్ పాస్ ఉండాలి.. అది కాదంటే రవాణా శాఖకు చెందిన ఉద్యోగులైనా అయి ఉంటే వారు టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయడానికి అనుమతి ఉంటుంది. మరీ ఉచితంగా బస్‌లో ప్రయాణం చేయాలంటే ఎలా.. అంటే అది కూదరదు. కానీ తమిళనాడు ప్రభుత్వం ఇపుడు విద్యార్థులకు ఉచితంగా బస్‌లో ప్రయాణం చేసేలా అనుమతి ఇచ్చింది. అదెలా? అంటే పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు యూనిఫాంతో బస్ ఎక్కితే వారిని పాస్ అడగొద్దని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోని కొన్ని రాష్ర్టాలు 10వ తరగతి వరకు చదివే విద్యార్థినులకు ఉచిత బస్ ప్రయాణం అవకాశం కల్పించాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10వ తరగతి వరకు ఉచిత ప్రయాణానికి అనుమతి ఇచ్చింది.
ప్రియాంక చోప్రా ఆ సినిమా ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చిందా..?
ప్రియాంక ఓ ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది.ఆ సినిమా పేరు మాత్రం నేను బయటకు చెప్పను. కానీ ఆ సినిమా అనుభవం మాత్రం నాకు నచ్చలేదు.. సెట్స్ లో నేను గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. తీరా చూస్తే నాకిచ్చే డైలాగ్స్ కూడా ఎంతో చెత్తగా ఉండేవి. అస్సలు సెన్స్ లేని డైలాగ్స్ అవి. సెట్స్ లో నేను ఓ బొమ్మలా కూర్చునేదాన్ని, నిజానికి నాది అలాంటి క్యారెక్టర్ కాదు.. అందుకే ఆ సినిమా నాకు అస్సలు నచ్చదు అని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ సినిమా ఏంటన్నది మాత్రం ప్రియాంక చెప్పలేదు.ప్రస్తుతం ప్రియాంక వరుసగా హాలీవుడ్ ప్రాజెక్ట్ లతో చాలా బిజీగా ఉంది. ఇటీవలే ఈ అమ్మడు నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ప్రైమ్ లో విడుదలై మంచి వ్యూవర్ షిప్ ను పొందింది.. దీనితో పాటుగా లవ్ ఎగేన్ అనే రొమాంటిక్ కామెడీ డ్రామా ను కూడా చేసింది. ప్రస్తుతం ప్రియాంక హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే సినిమా ను చేస్తుంది. ఇలియా నైషుల్లర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్నట్లు సమాచారం.
పురాణ ఫాంటసీ కథతో రాబోతున్న నిఖిల్…!!
నిఖిల్ పాన్ ఇండియా వ్యాప్తంగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”స్పై”. యాక్షన్ థ్రిల్లర్ గా బీ హెచ్ గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా చేస్తుంది… ఆ సినిమా ఇది జూన్ చివరిలో విడుదల కానుంది. ఇక ఇది విడుదల కు రెడీ చేస్తూనే నిఖిల్ మరిన్ని సినిమాలను లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే.. ఈ మధ్యే నిఖిల్ హీరోగా ‘ది ఇండియా హౌస్’ పేరుతో రామ్ చరణ్ నిర్మాతగా వి మెగా పిక్చర్స్ బ్యానర్ పై మొదటి సినిమాను గ్రాండ్ లెవల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఈ సినిమా 1900 దశకంలో భారతదేశ చరిత్రలో జరిగిన కథాంశంతో తెరకెక్కుతుందని సమాచారం.. ఇదిలా ఉండగా ఈ యువ హీరో మరో సినిమాను కూడా ప్రకటించారు. ఇది ఆయన కెరీర్ లో 20వ సినిమా కాగా ఈ రోజు ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ కూడా రాబోతున్నట్టు సమాచారం.ఈ సినిమా యువ యోధుడిని వర్ణించే పురాణ ఫాంటసీ కథ అని తెలుస్తుంది..భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.రవి బసృర్ సంగీతం ను అందిస్తున్నారు. ఇలా ఈ యువ హీరో కంటెంట్ ఓరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు.
భోళా శంకర్ వస్తున్నాడు… ఇక ‘మెగా ఫెస్టివల్’ గ్యారెంటీ
ఆగస్టు 11న రిలీజ్ కానున్న భోళా శంకర్ సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ‘భోళా మేనియా’ సాంగ్ ని రిలీజ్ చెయ్యనున్నారు. ఈ సాంగ్ తో మెగా ఫెస్టివల్ ని స్టార్ట్ చేయడానికి మహతి స్వర సాగర్ రెడీగా ఉన్నాడు. జూన్ 4న రిలీజ్ కానున్న భోళా మేనియా సాంగ్ ప్రోమోని జూన్ 2న రిలీజ్ చెయ్యనున్నారు. ఈ అనౌన్స్మెంట్ ఇస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ చిరు మస్త్ ఉన్నాడు. ఆ స్టైల్ అండ్ స్వాగ్ ఎన్ని ఏళ్లు అయినా మెగాస్టార్ నుంచి పోదు నిజం చేసేలా ఈ పోస్టర్ ఉంది. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ భోళా మేనియా సాంగ్ లో సూపర్ ఉంటాయని టాక్ వినిపిస్తోంది. మరి శేఖర్ మాస్టర్ స్టెప్స్, చిరు గ్రేస్, మహతి స్వర సాగర్ కంపొజిషన్ అన్నీ కలిసి ‘భోళా మేనియా’ సాంగ్ ని ఎంత స్పెషల్ గా మార్చనున్నాయో చూడాలి.
Lavanya tripati -varun tej : వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్?