రోహిణికార్తెలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో ఎండ తీవ్రతకు ఉక్కపోత తోడుకావడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇదిలా ఉండగా.. పలు జిల్లాల్లో అక్కడక్కడ రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడనున్నట్లు తెలిపింది.
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో దారుణ హత్య జరిగింది. ఆర్థిక వ్యవహారాల విషయంలో అత్తమామలతో ఘర్షణకు దిగిన అల్లుడు ఆగ్రహంతో వారిపై దాడి చేశాడు.
మహానాడులో టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానమని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోను కాపీ కొట్టి మహానాడులో ప్రకటించారని ఆయన ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ బీమా పథకం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 7వ తేదీ వరకు ఇది కొనసాగనుంది. ఈ పథకం ద్వారా 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న కుటుంబ పెద్ద ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబసభ్యులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్ధిక సాయం అందిస్తుంది.
ఏపీలో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ పోలవరంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక ప్రకటన చేశారు. త్వరలో రూ. 12 వేల కోట్లకు పైగా నిధులు పోలవరం కోసం ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు.పోలవరం నిర్మాణం కోసం రూ. 12, 911 వేల కోట్లను కేంద్రం ఇవ్వబోతోందని ఆయన తెలిపారు.
గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సీఎం పంపిణీ చేశారు. 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా సీఎం జగన్ పంపిణీ చేశారు.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. . అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ జారీ చేసింది.