AP CM Jagan: వైఎస్సార్ యంత్ర సేవ-2 పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM Jagan: గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ యంత్ర సేవా పథకం మెగా మేళాను ప్రారంభించారు. రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను సీఎం జగన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రూ. 361.29కోట్ల విలువైన 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లను రైతు గ్రూపులకు సీఎం పంపిణీ చేశారు. 13,573 ఇతర వ్యవసాయ పనిముట్లను కూడా సీఎం జగన్ పంపిణీ చేశారు. రైతన్నల గ్రూప్‌ల ఖాతాల్లో రూ.125.48 కోట్ల సబ్సిడీ జమ చేశారు. ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లయితేనేమి, వ్యవసాయ పరికాలైతేనేమి.. ఇటువంటివన్నీ అందుబాటులోకి తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ రైతన్నలే గ్రూపు కింద ఫామ్ అయ్యి, ఆర్బీకే పరిధిలో ఉన్నమిగిలిన రైతులకు కూడా యంత్రాలన్నీ అందుబాటులోకి తీసుకొచ్చే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 10,444 ఆర్బీకేల పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ పరిధిలో, ఆర్బీకేలతో అనుసంధానమై, ఆర్బీకే పరిధిలోని రైతన్నలే ఈ వ్యవసాయ పనిముట్లన్నీ అతి తక్కువ ధరకు మిగిలిన రైతులకు అందుబాటులోకి తీసుకొస్తారన్నారు.
గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన అర్థం చెప్పే కార్యక్రమం ఈరోజు జరుగుతోందని సీఎం స్పష్టం చేశారు. ఇంతకు ముందు మనం 6,525 ఆర్బీకే స్థాయిలో, 391 క్లస్టర్ స్థాయిలోనూ కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు రైతుల పేరుతో ఓపెన్ చేశామన్నారు. అక్కడ 3,800 ట్రాక్టర్లను, 391 కంబైన్ హార్వెస్టర్లను, 22,580 ఇతర యంత్రాలను సప్లయ్ చేశామని సీఎం చెప్పారు. ఈరోజు 3,919 ఆర్బీకే స్థాయిలో, మిగిలిన వంద క్లస్టర్ స్థాయి కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు అన్నింట్లోనూ 2,562 ట్రాక్టర్లు, 100 కంబైన్ హార్వెస్టర్లతో పాటు 13,573 ఇతర యంత్రాలను అందుబాటులో ఉండేటట్లు ఈరోజు కార్యక్రమంతో జెండా ఊపి స్టార్ట్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఆర్బీకే స్థాయిలో కూడా 15 లక్షల రూపాయలు కేటాయింపు చేసి అక్కడ ఎటువంటి యంత్రాలు కావాలన్నా ఆ రైతుల్నే డిసైడ్ చేయాలని చెప్పి.. వాళ్లు డిసైడ్ చేసిన దాని ప్రకారం 15 లక్షలతో వారి అవసరాల మేరకు తీసుకొచ్చామని సీఎం తెలిపారు. 491 క్లస్టర్ స్థాయిలో వరి బాగా పండుతున్న ప్రాంతాల్లో అక్కడ కంబైన్ హార్వెస్టర్ తీసుకురావాల్సిన అవసరం ఉందని అనిపించిన స్థాయిలో 491 క్లస్టర్లను ఐడెంటిఫై చేశామని ఆయన చెప్పారు.
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
Read Also: Nomophobia : నోమోఫోబియా.. ప్రతి నలుగురిలో ముగ్గురికి..
“ఒక్కొక్క క్లస్టర్ స్థాయిలో ఒక్కో హార్వెస్టర్‌ను 25 లక్షల రూపాయలతో వాళ్లకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. 1,052 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆర్బీకేల పరిధిలో ఇవన్నీ తీసుకొస్తున్నాం. గ్రూపులుగా ఫామ్ అయిన రైతులు కేవలం 10 శాతం కడితే చాలు.. 40 శాతం గవర్నమెంటే సబ్సిడీ కింద ఇచ్చి మిగిలిన 50 శాతం లోన్ల కింద ఆ ఆర్బీకే పరిధిలో ఉన్న ఆ రైతాంగానికి ఇదంతా అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఆర్బీకే స్థాయిలోనే ఏ రైతు అయినా వాడుకొనేందుకు అతి తక్కువ అద్దెతో ఇవన్నీ అందుబాటులో ఉండేందుకు వైఎస్సార్ యంత్ర సేవా యాప్‌ను కూడా తీసుకొస్తున్నాం. వీటి వల్ల 15 రోజులు ముందుగానే ఆ రైతన్నలు బుక్ చేసుకోవచ్చు. ఆర్బీకే పరిధిలో ఉన్న ప్రతి రైతన్న కూడా దీన్ని ఉపయోగించుకొనే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నా. ఇదే మాదిరిగానే మళ్లీ ఈ సంవత్సరమే అక్టోబర్ మాసంలో 7 లక్షల మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ వ్యవసాయ పనిముట్లను, వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లను అందజేస్తాం. స్ప్రేయర్లు, టార్పాలిన్లు.. ఇలాంటివి కూడా అక్టోబర్ మాసంలో ఆ 7 లక్షల మంది రైతన్నలకు పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఆర్బీకే అన్న ఒక వ్యవస్థను పటిష్ట పరుస్తూ రైతన్నలకు ఇంకా మంచి జరిగించాలి అనే తపన, తాపత్రయంతో అడుగులు పడుతున్నాయి. రైతులకందరికీ మంచి జరగాలని, దేవుడి దయ, ప్రజలందరి చల్లని ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా.” అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!