Acid Attack: దారుణం.. వివాహితపై యాసిడ్ దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Acid Attack: ఏలూరులోని విద్యానగర్‌లో దారుణం జరిగింది. వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్‌తో దాడి చేశారు. రాత్రి స్కూటీపై వెళుతుండగా దుండగులు యాసిడ్ చల్లడంతో ఆమె తీవ్ర గాయాలతో ఆస్పతిలో చికిత్స పొందుతుంది. మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడ తరలించారు. అయితే, ఆమె కంటిచూపు కోల్పోయినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరులోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్న యడ్ల ప్రాన్సిక (35) అనే మహిళ భర్త ఆంజనేయులుతో ఏడాది క్రితం గొడవ కారణంగా వేరుగా ఉంటోంది. ఆంజనేయులు రాజమండ్రిలో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. ప్రాన్సిక తన ఐదేళ్ల కుమార్తె స్మైలీతో తన పుట్టింటి వారితోనే ఉంటుంది. రెండు నెలల క్రితం విద్యానగర్‌లో ఒక డెంటల్ క్లినిక్‌లో రిసెప్షనిస్టుగా చేరింది. అయితే, మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో డ్యూటీ దిగి తన స్కూటర్‌పై ఇంటికి వెళ్తుండగా ఇంటి సమీపంలోని మానిస్ట్రీ దగ్గర గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటారు సైకిల్‌పై ఆగి అకస్మాత్తుగా ప్రాంచికపై యాసిడ్ పోశారు. ఆమె కేకలు వేస్తూ సమీపంలోని ఇంటి వద్దకు వెళ్ళిపోయింది.
Also Read: Goods Train Derailed: పట్టాలు తప్పిన రైలు.. విశాఖ-విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అనంతరం, పరిస్థితి తీవ్రంగా మారగా.. ఆమె చెల్లి యడ్ల సౌజన్య, కుటుంబ సభ్యులు వెంటనే ఆమెపై నీళ్లు పోసి కాలిపోయిన దుస్తులను మార్చి మరో స్కూటర్‌పై ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె రెండు కళ్లు చూపు కోల్పోయినట్లు గుర్తించారు. ఆస్పత్రిలో బాధితురాలిని డీఐజీ అశోక్‌కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి, ఏఎస్పీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఘటనా వివరాలు సేకరించారు. ఏలూరులో మహిళపై యాసిడ్ దాడి చేసిన నిందితుల కోసం జిల్లా ఎస్పీ ప్రశాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఏలూరు డీఎస్పీ శ్రీనివాస్ పర్యవేక్షణలో నగరంలోని సీఐలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. యాసిడ్ దాడి విషయంలో ఎస్పీ ప్రశాంతి స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!