నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, వేమిరెడ్డి పట్టాభి కలిశారు. కోటంరెడ్డి నివాసంలో సుధీర్ఘ చర్చలు నిర్వహించారు.
చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తాడే తప్ప ఎప్పుడు కూడా సింగిల్‌గా వచ్చింది లేదన్నారు.
ఖాతాదారులకు మరింతగా చేరువయ్యేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరిన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆస్తుల రిజిస్ట్రేషన్ ఫీజులు, అన్ని రకాల యూజర్ చార్జీలను ఇకపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ)లోనూ చెల్లించొచ్చు. అన్ని రకాల స్టాంప్ పేపర్లు కూడా ఈ బ్యాంకు శాఖల్లో లభిస్తాయి.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు (శనివారం) క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.
మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన దేశాభివృద్ధిని వివరించేందుకు బీజేపీ తలపెట్టిన సభల్లో ఒకటి శనివారం సాయంత్రం శ్రీకాళహస్తిలోని భేరివారి మండపం వద్ద జరగనుంది. ఇవాళ శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా అధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది.
రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ధి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ , బీసీ, మైనార్టీ, రెవెన్యూ, టీ-సెర్, మహిళ, ట్రాన్స్ జెండర్ శాఖ ఆధ్వర్యంలో సంక్షేమ సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని ప్రసంగించారు.
ఏపీలో ఇటీవల నిర్వహించిన లక్ష్మీ రాజ శ్యామల యాగం చేసిన ఫలితంగా అనుకూల పరిస్థితులు వచ్చాయని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న నిధులు ఇప్పుడే వచ్చాయన్నారు.