Botsa Satyanarayana: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు విసిరారు. కాశీ యాత్ర లాగా వారాహి యాత్ర అంటే ఏం అర్థం అవుతుంది? అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర అంటే అర్థమవుతుందన్నారు. రాజకీయ నాయకులు యాత్రలు చేస్తే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవటం సాధారణమని.. జగన్ పాదయాత్ర అప్పుడూ మేం అనుమతి తీసుకున్నామన్నారు. రాజ్యాంగబద్దంగా ఎవరిపై ఎటువంటి ఆంక్షలు లేవన్నారు. “వైఎస్సార్‌సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఆపేస్తానని చెప్పమనండి. పవన్ కళ్యాణ్ పార్ట్‌నర్ మొన్ననే మేం అమలు చేస్తున్న పథకాలను పెంచి ఇస్తానని చెప్పాడు. చంద్రబాబు తాను తీసుకుని వచ్చిన ఒక పథకం పేరు చెప్పగలడా?” అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
Also Read: Botsa Satyanarayana: ప్రతి రూపాయి రాష్ట్ర అభివృద్ధికే.. అమిత్ షా వ్యాఖ్యలకు బొత్స హార్డ్ కౌంటర్
మూడు టీవీలు ఉన్నాయని సొల్లు కబుర్లు చెబితే సరిపోతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. “వాళ్ళు రాజకీయ నాయకులే.. తపస్సు చేసుకునే సాధువులు కాదు. ఎన్నికలు రాగానే టక్కుటమారా వేషాలు వేస్తున్నారు’’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.