Somu Veerraju: బీజేపీ మాతో అండగా ఉండకపోవచ్చన్న జగన్ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. బీజేపీ ఎప్పుడు వైసీపీతో కలిసి ఉందో సీఎం జగన్ చెప్పాలన్నారు. ఏపీలో బీజేపీని పలుచన చేయాలనేది జగన్ వ్యూహమని.. జగన్ అలా మాట్లాడటానికి హక్కు లేదన్నారు. జగన్‌కు పవన్ ఎందుకు సపోర్టు చేయాలని.. పవన్ మా మిత్ర పక్షం కాబట్టి తాను మాట్లాడుతున్నానన్నారు. పవన్ నాకు సపోర్టు చేయటం లేదని జగన్ అంటున్నారన్న సోము వీర్రాజు.. ఏపీలో రాజకీయ పార్టీలు అన్నీ జగన్‌కు సపోర్టు చేయాలా అంటూ ప్రశ్నించారు. మేం విమర్శలు చేస్తే జగన్ ఏం మాట్లాడరన్నారు. మోడీ దగ్గరకు వెళ్లి జగన్ డబ్బులు తెస్తున్నారని.. కేంద్రం చేసే అన్ని పనులకు వైసీపీ ముద్ర వేసి బీజేపీని జగన్ పలుచన చేస్తున్నారన్నారు. బీజేపీపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
Also Read: Botsa Satyanarayana: వారాహి యాత్ర అంటే ఏం అర్థం అవుతుంది?.. పవన్ యాత్రపై బొత్స సెటైర్లు
“కేంద్రం పోలవరానికి డబ్బు ఇచ్చింది. రాష్ట్రానికి ఇటీవల 14 వేల కోట్లను కేంద్రం రాష్ట్రానికి ఇచ్చింది. కేంద్రాన్ని కాదని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం లేదు. విభజన హామీలపై మంత్రులకు టెస్ట్ పెడతాం. లేదా విభజన హామీలపై మేం ఏం చేస్తామో మంత్రులకు పుస్తకాలు పంపిస్తాం. మేం ఎప్పుడు వైసీపీతో లేము, ఉండటం జరగదు. వైసీపీకి సహకరిస్తామని బీజేపీ లేదా జనసేన చెప్పలేదు. ఈ నెల 20 నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి బీజేపీ 9 ఏళ్లలో ఏం చేసిందో చెబుతాం. ఇసుక, ఎర్ర చందనం ఎలా కొట్టేయాలని అని మీరు ఆలోచన చేస్తారు. మేం రోడ్లు వేయటం వంటి అభివృద్ది ఆలోచనలు చేస్తాం. పోలింగ్ బూతు పరిధిలో ఉన్న లబ్ధిదారులకు కేంద్రం నుంచి వచ్చిన కిట్‌లు అందిస్తాం.” అని సోము వీర్రాజు పేర్కొన్నారు.