బిగ్‌బాస్ రియాల్టీ షోపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ కార్యక్రమం ప్రసారానికి ముందు సెన్సార్‌షిప్ చేయకపోతే ఎలా అంటూ నిర్వాహకుల్ని ప్రశ్నించింది. అలాగే ఈ షో ప్రసారం అయ్యాక దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అందే ఫిర్యాదులను పరిశీలించడం పోస్టుమార్టంతో పోల్చింది.
ఏపీలో మహిళల మిస్సింగ్‌లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్లకు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ప్రకటన చేశారని.. దానిపై పవన్ వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొన్నారు.
బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్రమంత్రి మురళీధరన్‌తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం కేంద్ర మంత్రి ఇంటికి వెళ్లారు.
పవన్ సిగ్గు లేకుండా ఎన్డీయే మీటింగ్‌కు ఎందుకు వెళ్ళాడో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. మోడీకి చంద్రబాబు చేసిన అవమానాలు గుర్తున్నాయని.. అందుకే ఎన్డీయే మీటింగ్‌కి టీడీపీని పిలవలేదని.. కానీ పవన్ సిగ్గులేని వాడంటూ ఆమె వ్యాఖ్యానించారు. తల్లిని అవమానించిన చంద్రబాబును సీఎం చేసే పనిలో పవన్ ఉన్నారని ఆమె అన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. పోలవరం నిర్మాణ పనులపై మంత్రి ఆరా తీశారు. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ దగ్గర వరదపై సమీక్ష చేపట్టారు.
సిద్దాంతపరంగా భావజాలం కుదరని పార్టీలతో విపక్షాల కూటమి ఏర్పడిందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. బీజేపీని ఓడించేందుకే కూటమిగా ఏర్పడ్డారని పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం నాలుగేళ్ల కాలంలో రూ. 7.14 లక్షల కోట్ల మేర అప్పు ఉందని ఆమె ఆరోపించారు.
ప్రకాశం జిల్లా కేంద్రంలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. ఓ గిరిజన యువకుడితో ఫుల్లుగా మద్యం తాగించిన కొందరు వ్యక్తులు అతడిని చావబాది ఆపై నోట్లో మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందారు. అంతేకాదు, మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని బలవంతం చేస్తూ చితకబాదారు.
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగడంచలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ ఇంటి పెరట్లో పూలు ఉన్నాయని, వచ్చి కోసుకెళ్లమని నమ్మించి హరికుమార్ గౌడ్ అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది.