Andhrapradesh: మద్యం తాగుదామని పిలిచి.. చితకబాది.. నోట్లో మూత్రం పోసి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh: ప్రకాశం జిల్లా కేంద్రంలో అత్యంత అమానవీయ ఘటన జరిగింది. ఓ గిరిజన యువకుడితో ఫుల్లుగా మద్యం తాగించిన కొందరు వ్యక్తులు అతడిని చావబాది ఆపై నోట్లో మూత్రం పోసి పైశాచిక ఆనందం పొందారు. అంతేకాదు, మర్మాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని బలవంతం చేస్తూ చితకబాదారు. రక్తమోడుతున్న ఆ గాయాలతో అతను విలవిల్లాడుతున్నా కనికరం చూపలేదు. ఈ మొత్తం ఘటనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే.. బాధితుడైన గిరిజన యువకుడి పేరు మోటా నవీన్, ప్రధాన నిందితుడు మన్నె రామాంజనేయులు (అంజి) ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. నేరాలకు పాల్పడే వీరిపై 50కిపైగా గృహ దొంగతనాల కేసులు ఉన్నాయి. నవీన్ పలుమార్లు జైలుశిక్ష కూడా అనుభవించాడు. అంజి మాత్రం కొన్నేళ్లుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కొంతకాలంగా వీరిమధ్య గొడవలు జరుగుతున్నాయి. నెల రోజుల క్రితం మద్యం తాగుదామంటూ నవీన్‌ను అంజి ఒంగోలులోని కిమ్స్ ఆసుపత్రి వద్దకు పిలిచాడు. వెళ్తే అక్కడ మొత్తం 9 మంది కనిపించారు. అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు. ఆపై అంజి, నవీన్ మధ్య పాత గొడవ మరోమారు రేగింది. దీంతో అందరూ కలిసి నవీన్‌పై మూకుమ్మడి దాడిచేశారు. తనను వదిలెయ్యాలని బతిమాలినా వినిపించుకోలేదు. రక్తమోడేలా కొట్టారు. ఆపై నవీన్ నోట్లో మూత్రం పోస్తూ మర్మాంగాన్ని అతడి నోట్లో పెట్టుకోమని బలవంతం చేశారు. కొందరు ఈ తతంగం మొత్తాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Bengaluru: బెంగళూరులో పేలుడుకు ప్లాన్.. ఐదుగురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్
ఆ తర్వాత బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అదికాస్తా ఉన్నతాధికారుల దృష్టిలో పడింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా, ఇద్దరిని మాత్రం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నెల రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై బాధితుడు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేవలం దాడి, ఎస్సీ, ఎస్టీ కేసుగా నమోదు చేసి చేతులు దులుపుకున్నట్లు తెలిసింది. నిందితులు విచారణ, అరెస్టుకు సైతం ప్రయత్నించలేదని సమాచారం. తాజాగా నిందితుల్లో కొందరు ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది వైరల్‌గా మారి పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమై నిందితుల కోసం వెతుకులాట ప్రారంభించారు. ప్రధాన నిందితుడు పరారీ కాగా.. మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!