Crime News: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగడంచలో 17 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ ఇంటి పెరట్లో పూలు ఉన్నాయని, వచ్చి కోసుకెళ్లమని నమ్మించి హరికుమార్ గౌడ్ అనే వ్యక్తి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటన తర్వాత బాధితురాలు తమ తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పింది. 20 రోజుల క్రితం పెద్దమనుషుల సమక్షంలో బాలిక తల్లిదండ్రులు పంచాయితీ పెట్టారు. పంచాయితీలో బాలికను పెళ్లి చేసుకుంటానని హరికుమార్ గౌడ్ చెప్పడంతో వివాదం సద్దు మణిగింది.
Also Read: Milind Soman: 52ఏళ్లలో 25ఏళ్ల అమ్మాయిలతో పెళ్లిళ్లు.. మరి వివాదాలు రావా బాసూ!
తాజాగా మళ్లీ బాలికను పెళ్లి చేసుకోవడానికి హరికుమార్ గౌడ్ అంగీకరించకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హరికుమార్ గౌడ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.