దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆర్కిటెక్చ్యురల్ బోర్డ్ ఏర్పాటు చేశామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలకు తమకు నచ్చిన విధంగా ఏదనిపిస్తే అనిపిస్తే అది మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడలోని ఏ’ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్‌కు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. తనకు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.. తనకు యాభై కోట్ల రూపాయలు ఇస్తే చాలు ఆస్తులన్నీ రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబు నాయుడు రాయలసీమ వ్యతిరేకి అని, ఆయన రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని వైసీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జలయజ్ఞం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన అన్నారు. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరిస్తే చంద్రబాబు వ్యతిరేకించారన్నారు.
గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఆగడం లేదు. రోజు రోజుకూ గంజాయి అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఎంతలా అంటే.. ఏకంగా సెంట్రల్ జైలులో అమ్మకాలు జరిగేంతగా పెరిగిపోయాయి.
దేశంలో నానాటికీ మగాళ్లు.. మృగాళ్ల రూపంలో మారిపోతూ స్త్రీ లకు రక్షణ లేకుండా చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో.. రాను రాను సమాజం ఇలా తయారు అవుతుంది ఏంటి.. మనుషులు మరీ ఇంతలా దిగజారిపోతున్నారా అని అనుకున్న ప్రతిసారీ అంతకు మించి ఛీ అనుకునే సంఘటనలు జరుగుతూనే ఉంటున్నాయి.