దేశవ్యాప్తంగా కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది. కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా 140 పోలీసులను ఎంపిక చేయగా.. ఏపీ, తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు.
మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య డాక్టర్ రాధ దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. జవ్వారుపేటకు చెందినడాక్టర్ రాధను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసిన కేసులో కీలక పురోగతి లభించింది.
విద్యుత్ ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. పీఆర్‌సీపై ఉభయుల మధ్య ఎట్టకేలకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పాము, ముంగిస ఒకదానికి ఒకటి తారసపడ్డాయంటే..ఇక భీకర పోరే. అవి పొట్లాడుకున్న దృశ్యాలు మనం గతంలో చూసే ఉంటాం. అయితే నడిరోడ్డుపై తాచుపాము, ముంగిస భీకరంగా దాడి చేసుకుంటున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ అయ్యింది.
అంగళ్ళులో తనపైన హత్యాయత్నం జరిగిందని చంద్రబాబు ఆరోపణ చేస్తున్నారని, సీబీఐ విచారణకు సిద్ధం అంటున్నారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
వారాహి యాత్రకు వస్తున్న పవన్ కళ్యాణ్‌పై మంత్రి అమర్నాథ్ ప్రశ్నల వర్షం కురిపించారు. వారాహి వెబ్ సిరీస్ 3 అంటూ వ్యాఖ్యానించారు మంత్రి. ఉత్తరాంధ్రలో అక్రమాలు అన్యాయాలపై ప్రశ్నిస్తానంటున్న ప్యాకేజ్ స్టార్ తాను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి అమర్నాథ్.
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలన్నారు.
కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని వైసీపీ వ్యతిరేకించింది. అవిశ్వాస తీర్మానం చర్చలో వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్ రెడ్డి పాల్గొన్నారు. మణిపూర్‌లో మహిళపై అత్యాచార ఘటనలు బాధాకరమని.. ఆ రాష్ట్ర ప్రభుత్వం దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.