సీఎం విశాఖకు రాకపై మంత్రి అమర్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దసరా పండగ రోజున విశాఖ ప్రజలకు బ్రహ్మాండమైన కానుక ఉంటుందని ఆయన తెలిపారు. విశాఖ ప్రజలు ఎదురు చూస్తున్న కల దసరాతో తీరుతుందని పేర్కొన్నారు.
విజయవాడ కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ వ్యవహారంలో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్తీక్, నాగమణి, తమ్మిశెట్టి వెంకయ్య, కనక మహాలక్ష్మీ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు.
మహిళా,శిశు సంక్షేమశాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫౌండేషన్ స్కూల్‌లో చిన్నారులకు బోధనపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రత్యామ్నాయ బోధనా విధానాలపై పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు.
అమరావతి అసైన్డ్ భూముల కొనుగోళ్లపై చంద్రబాబు, నారాయణపై నమోదైన సీఐడీ కేసులపై ఏపీ హైకోర్టు తుది విచారణ చేపట్టింది. ఈ విచారణలో సీఐడీ కీలక వాదనలు వినిపించింది. కేవలం అమరావతిలో ఎస్సీల దగ్గర ఉన్న భూములను తక్కువకు బినామీలతో నారాయణ కొనుగోలు చేయించారని సీఐడీ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్‌సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఏపీ, తెలంగాణ) వీఎం.రెడ్డి (ఎయిర్ కమోడోర్) కలిశారు. విపత్తు నిర్వహణలో ఎన్‌సీసీ క్యాడెట్‌ల పాత్ర, బాధ్యతలు, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.
మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రాజెక్టు పనులు ముందుకు సాగాయన్నారు.
ఢిల్లీలో నేడు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అలోక్ సింగ్ను తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి ఎయిర్ ఇండియా కార్యాలయంలో కలిశారు. ఆయనకు శ్రీవారి పుష్ప ప్రసాదంతో తయారు చేసిన జ్ఞాపికను అందజేశారు.