Topudurti Prakash Reddy: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. తనకు రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపిస్తున్నారని.. తనకు యాభై కోట్ల రూపాయలు ఇస్తే చాలు ఆస్తులన్నీ రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. నా వద్ద ఉందంటున్న 1950 కోట్లతో రాప్తాడు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తారా అంటూ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఈ సవాల్‌ను స్వీకరించాలన్నారు. పాల డైరీ, బోరు బావుల ద్వారా ప్రజలకు సేవ అందిస్తున్న నైజం తనదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చంద్రబాబు బెదిరింపులకు భయపడే నైజం తనది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి నువ్వు ముఖ్యమంత్రి అయితే గుండు కొట్టించుకుంటానని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. హెరిటేజ్ ద్వారా రైతుల నుంచి 25 వేల కోట్ల రూపాయలు చంద్రబాబు దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు.
Also Read: Vizag Constable Case: ఆమె అందమే అతనికి శాపం.. ప్రియుడితో కలిసి కానిస్టేబుల్‌ని చంపిన భార్య
ఎన్టీఆర్ ట్రస్టుప్తె రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వెనుక ఉండి రాజకీయాలు చేయించడంలో దిట్ట అంటూ ఆరోపించారు. ట్రస్ట్‌లో ఫ్యాక్షన్ బాధితుల పిల్లలను చదివించి ఫ్యాక్షన్ చేయిస్తున్నారని ఆయన వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్‌లో క్రిమినల్స్‌ను తయారు చేసే అడ్డా అంటూ ఆరోపణలు చేశారు. అక్కడ చదువుకున్న వారు కేసుల్లో ఉన్నారని ఆయన అన్నారు.