Buggana Rajendranath Reddy: దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఆర్కిటెక్చ్యురల్ బోర్డ్ ఏర్పాటు చేశామని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలకు తమకు నచ్చిన విధంగా ఏదనిపిస్తే అనిపిస్తే అది మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసే ప్రతి పనిని వాళ్లు విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా నిధులు తెచ్చి కనీవినీ ఎరగని పనులు చేశామని మంత్రి తెలిపారు.
Also Read: AP CM Jagan: ఆప్కాబ్ వజ్రోత్సవ వేడుకల్లో సీఎం జగన్..
అభివృద్ధి కోసం అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తాయని.. కేవలం ఏపీ మాత్రమే అప్పులు చేస్తున్నట్లు అబద్ధాలు చెప్తున్నారని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం కన్నా తక్కువ అప్పే చేశామన్నారు. గత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో కలిసి ఉన్నా రాష్ట్రానికి నిధులు తీసుకురాలేక పోయారన్నారు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడే ఎక్కువ నిధులు తెచ్చామని మంత్రి చెప్పారు. ప్రభుత్వంపై అన్యాయంగా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.