AP CM Jagan: విజయవాడలోని ‘ఏ’ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) వజ్రోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సీఎం జగన్‌కు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. వజ్రోత్సవ వేడుకలకు సింబల్‌గా 60 గులాబీల పుష్ప గుచ్చంతో సీఎం జగన్‌కు మంత్రి కాకాణి స్వాగతం పలికారు. బ్యాంకు నూతన లోగో, పోస్టల్ స్టాంపును సీఎం ఆవిష్కరించారు. కొత్త బ్రాండ్ సంకల్ప్ ప్రాజెక్టును సీఎం ప్రారంభించారు. 13 డీసీసీబీలకు డివిడెండ్ల పంపిణీతో పాటు బ్యాంకు విజన్ డాక్యుమెంట్‌ను సీఎం ఆవిష్కరించారు. 1963లో ప్రారంభమైన ఆప్కాబ్.. చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతికి పనిచేస్తోంది. ఆప్కాబ్ పరిధిలో 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, 1995 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఉన్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక రూ.36,732 కోట్ల టర్నోవర్ సాధించింది. 2019 నాటికి కేవలం రూ.13,322 కోట్ల టర్నోవర్‌కే పరిమితమైంది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో 4 ఏళ్లలో రూ.251 కోట్ల లాభాల్లోకి ఆప్కాబ్ వెళ్లింది. ఈ నాలుగేళ్లలో రెండు సార్లు జాతీయ అవార్డులను ఆప్కాబ్ సాధించింది.
Also Read: Topudurti Prakash Reddy: చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్
రాష్ట్ర సహకార రంగ చరిత్రలో ఈ రోజుకు ఎంతో ప్రత్యేకత ఉందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఆప్కాబ్ షష్టిపూర్తి జరుపుకుంటోందని.. 60 ఏళ్ళ ప్రయాణంలో ఆప్కాబ్ రైతులకు అండగా నిలబడిందన్నారు. భారత రైతు అప్పుల్లోనే పుడతాడు, అప్పుల్లోనే బతుకుతాడు, అప్పుల్లోనే చనిపోతాడు అని ఒక నానుడి ఉండేదని.. బ్యాంకింగ్ వ్యవస్థ రైతులకు దగ్గర అడుగులు వేయటంతో కీలక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. సహకార బ్యాంకులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆప్కాబ్ ను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారని సీఎం తెలిపారు. ఓవర్ ఆల్ పెర్ఫార్మెన్స్‌లో కృష్ణా జిల్లా డీసీసీబీ నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఉత్తమ డీసీసీబీలకు అవార్డుల ప్రదానం జరిగింది. నెల్లూరు డీసీసీబీ, కర్నూలు డీసీసీబీలకు అవార్డులు లభించాయి.
Also Read: Vizag Constable Case: ఆమె అందమే అతనికి శాపం.. ప్రియుడితో కలిసి కానిస్టేబుల్‌ని చంపిన భార్య
ఇవాళ 60 ఏళ్ళు పూర్తి చేసుకున్నామని.. 2019లో 13 వేల కోట్ల లావాదేవీలు ఉంటే.. ఇవాళ 36 వేల కోట్ల లావాదేవీలకు పెంచటం వెనుక ముఖ్యమంత్రి కృషి ఉందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. సహకార రంగానికి ముఖ్యమంత్రి సహకారంతోనే డీసీసీబీలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాటన ప్రయాణం చేస్తున్నాయన్నారు. సహకార బ్యాంకులు కమర్షియల్ బ్యాంకులతో పోటీ పడుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో కొత్త నిర్ణయాలు ఆచరిస్తున్నామని… దేశం అనుసరిస్తుందన్నారు. ప్లాటినం జూబ్లీ వేడుకలను ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో జరుపుకుంటున్నామన్నారు.