Vishweshwar Reddy: ఓటమి భయంతోనే చంద్రబాబు అండ్ కో దొంగ ఓట్ల డ్రామాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishweshwar Reddy: చంద్రబాబు నాయుడు రాయలసీమ వ్యతిరేకి అని, ఆయన రాయలసీమకు ఏం చేశారో చెప్పాలని వైసీపీ నేత, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ జలయజ్ఞం చేపడితే చంద్రబాబు అడ్డుకున్నారని ఆయన అన్నారు. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరిస్తే చంద్రబాబు వ్యతిరేకించారన్నారు. వైఎస్సార్ పోతిరెడ్డిపాడు విస్తరణ వల్లే రాయలసీమకు సాగు, తాగు నీటి కష్టాలు తీరాయని ఆయన తెలిపారు. 1996, 1999లో రెండు సార్లు హంద్రీనీవా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు ఎందుకు పనులు చేయలేదని విశ్వేశ్వర రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే హంద్రీనీవా, గాలేరు – నగరి సహా రాయలసీమ ప్రాజెక్టులకు మోక్షం లభించిందన్నారు. హంద్రీనీవా కోసం ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు.
Also Read: Mamata Banerjee: అమిత్ షా చెప్పింది కరెక్టే.. బిగ్ షాక్ ఇచ్చిన మమతా బెనర్జీ
Also Read
- INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
- Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
- In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
- 22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
40 టీఎంసీల హంద్రీనీవా ప్రాజెక్టును ఐదు టీఎంసీలకు కుదించి సీమకు అన్యాయం చేసిన దుర్మార్గుడు చంద్రబాబు అంటూ విశ్వేశ్వర రెడ్డి మండిపడ్డారు. కరవు ప్రాంతాలకు కృష్ణా జలాలు వైఎస్సార్ పుణ్యమేనని ఆయన తెలిపారు. చంద్రబాబు హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల వల్ల రైతులకు ఎంతో మేలు జరిగిందని ఆయన తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టులను సీఎం జగన్ చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పం లో చంద్రబాబు ఓడిపోతున్నారని.. ఓటమి భయంతోనే చంద్రబాబు అండ్ కో దొంగ ఓట్ల డ్రామాలు ఆడుతున్నారని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
INDIA Bloc: 30న ఇండియా కూటమి కీలక భేటీ.. ‘సర్’పై భవిష్యత్ కార్యాచరణపై చర్చ
-
Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
-
In Service Teachers TET: బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1న మరో టెట్ నోటిఫికేషన్..
-
22A Registrations: తెలంగాణలో 22-A ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్.. కానీ షరతులు వర్తిస్తాయ్..
-
Shehbaz Sharif: ఆపరేషన్ సిందూర్‌పై షరీఫ్ ప్రేలాపనలు.. నవ్వుకున్న భారత్ దౌత్యవేత్త
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?