ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలినట్టు అయ్యింది.. వైసీపీకి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే యామిని బాల.. ఓ విడియో విడుదల చేసిన ఆమె.. తాను వైసీపీకి గుడ్‌బై చెబుతున్నట్టు పేర్కొన్నారు.. ఇంత కాలం తనకు సహకరించిన పార్టీ శ్రేణులు, అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు
పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను కన్నబిడ్డలా చూడటం, విద్యా, ఆర్థిక పరంగా వృద్ధిలోకి తీసుకురావటం అనే అంశాలను మాత్రమే చూస్తూ ఒక తండ్రిలా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్ గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి అని కాకర్ల సురేష్ పేర్కొన్నారు. ఓటు ద్వారా విజయం సాధిద్దాం.. అదే విధంగా అజాతశత్రువు సేవకుడు అయినటువంటి ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలన్నారు.
ఏపీలో బీజేపీ అభ్యర్థుల జాబితా ప్రకటన నాటి నుంచి కొనసాగుతున్న సస్పెన్స్ వీడిపోయింది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరారు. పాలకొల్లు ప్రజాగళ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన సైకిల్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుకు చంద్రబాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా 33 మంది పెన్షన్ దారులు చనిపోయారని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు.
గుంటూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గుంటూరు లోక్‌సభ అభ్యర్థిగా ఎన్నారై పెమ్మసాని చంద్రశేఖర్‌ను బరిలోకి దిగిన విషయం విదితమే.. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఆయన.. మిత్ర పక్షాలైన జనసేన, బీజేపీ నుంచి కూడా అపూర్వ స్వాగతం లభిస్తోంది..