AP Inter Results 2024: ఆంధ్రప్రదేశ్‌లో నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు విద్యామండలి అధికారికంగా ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేయనున్నారు. ఫలితాలకు సంబంధించిన అంతర్గత పనున్నీ ఏప్రిల్ 10న మధ్యాహ్నంతో పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం విజయవాడలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో విడుదల చేయనున్నారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు.
Read Also: Astrology: ఏప్రిల్ 12, శుక్రవారం దినఫలాలు
ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను httsps://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. దాదాపు 10లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మార్చి 20 తో ఎగ్జామ్స్ ముగిశాయి. ఈనెల 4నాటికి స్పాట్ వాల్యుయేషన్ పూర్తిచేశారు. రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేస్తోంది విద్యాశాఖ. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో సాధ్యమైనంత వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేశారు అధికారులు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఈసీ అనుమతి కూడా తీసుకున్నారు. కోడ్ కారణంగా రాజకీయనాయకుల ప్రమేయం లేకుండా ఇంటర్‌బోర్డ్ ఉన్నతాధికారులే ఈసారి ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఇక, పరీక్షా ఫలితాల రోజే ఇంప్రూమెంట్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించనున్నారు. వాటి ఫీజు వివరాలు కూడా ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఇంటర్ ఫలితాల తేదీ ప్రకటన కావడంతో ఇంకా కొద్ది గంటల్లోనే తమ భవిష్యత్ తేలనుందన్న టెన్షన్‌లో విద్యార్థులున్నారు.