ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం గుండుపల్లి పంచాయతీలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 'పల్లె పల్లెకు కాకర్ల' కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో 1 పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయనున్న సీపీఐ అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రకటించారు.
మనందరి బతుకులు మార్చుకునేందుకు కీలకమైన సమయానికి వచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల జలగ పాలనలో మనకేమైన మిగిలిందా.? మన జీవితాలు బుగ్గి అయిపోయాయన్నారు. అన్ని వర్గాలు సంక్షోభంలో పడ్డాయి.. ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిందన్నారు.
కర్నూలు జిల్లా కోడుమూరులో పుష్ప సినిమా సీన్ తరహాలో మద్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుజికి క్యారియర్ వాహనాన్ని నిందితుడు మాడిఫికేషన్ చేసి మద్యాన్ని సరఫరా చేస్తున్నాడు.
ఏపీలో పింఛన్ దారుల్లో వాలంటీర్లకు మంచిపేరు తెచ్చి పెట్టిందని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి తెలిపారు. చంద్రబాబు హయాంలో రెండు మూడు రోజుల సమయం పట్టేదని.. పింఛన్ కోసం వెళ్లి ఎంతో మంది చనిపోయారని ఆయన విమర్శించారు. వాలంటీర్లు పింఛన్ దారులకు దేవుళ్లుగా కనిపించారన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు విశాఖను ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. వచ్చేది పాల్ ప్రభుత్వమే... అధికారంలోకి రాగానే విశాఖను ఇంటర్నేషనల్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు.
ఏపీలోని ఉదయగిరి నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ ప్రచార జోరు కొనసాగుతోంది. సీతారాంపురంలో పల్లె పల్లెకు కాకర్ల కార్యక్రమాన్ని ఆయన విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు.