బాబు, పవన్‌కు ఓపెన్ ఛాలెంజ్.. నిరూపిస్తే రాజకీయాలకు గుడ్‌బై.. మీరు సిద్ధమా..?
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్.. చంద్రబాబు, పవన్ తణుకు సభ అట్టర్ ప్లాప్ అన్న ఆయన.. హైదరాబాద్ లో నా కుటుంబానికి రెండు స్టీల్ ఫ్యాక్ట్రరీలు చూపిస్తే కూటమి అభ్యర్థులకు గిఫ్ట్ గా ఇచ్చేస్తా.. ఫ్యాక్టరీలు ఉన్నట్టు నిరూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటా.. నిరూపించలేకపోతే మీరు రాజకీయాలు వదిలేస్తారా..? అంటూ బహిరంగ సవాల్ విసిరారు.. ఎవరో పనికిమాలిన వాళ్లు స్క్రిప్ట్ ఇస్తే పవన్, బాబు చదివేశారు.. పవన్ కోసం బట్టలు చించుకున్నవారిని నట్టేట ముంచారు.. మీ పార్టీ వాళ్లకు న్యాయం చేయలేని వారు ప్రజలకు ఏం చేస్తారు..? అని ప్రశ్నించారు.
ఒంగోలులో టెన్షన్ టెన్షన్.. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
ప్రకాశం జిల్లా ఒంగోలులో పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరింది.. ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.. ఇరుపార్టీల ప్రధాన నేతలు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందినవారికి గాయాలయ్యాయి.. ఒంగోలులోని సమత నగర్ లో ప్రారంభమైన ఈ గొడవ కాస్తా.. ఒంగోలు రిమ్స్ వరకు చేరింది..సమత నగర్ ప్రచారం నిర్వహించారు వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు కావ్య రెడ్డి.. అయితే, ఆమె ప్రచారాన్ని ఓ అపార్ట్ మెంట్ లోని మహిళలు అడ్డుకున్నారు. అపార్ట్ మెంట్ వద్ద మహిళలకు వైసీపీ కార్యకర్తలకు మాటామాట పెరగటంతో గొడవకు దిగారు ఇరు పార్టీల శ్రేణులు.. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి.. టీడీపీ కార్యకర్తపై దాడికి పాల్పడ్డ వైసీపీ కార్యకర్తలను అరెస్టు చేయాలంటూ ఎస్పీ కార్యాలయం వద్దకు ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్ధి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అసెంబ్లీ అభ్యర్ధి దామచర్ల జనార్దన్ ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
నన్ను టచ్ చేస్తే ఊరుకున్నా.. నా ఫ్యామిలీని టచ్ చేసినా ఊరుకోవాలా..?
ఒంగోలులో వైసీపీ-టీడీపీ నేతల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది.. అయితే, ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి.. నన్ను టచ్ చేస్తే ఊరుకున్నా.. నా ఫ్యామిలీని టచ్ చేసినా కూడా ఊరుకోవాలా..? అని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన మా కోడలిపై టీడీపీ శ్రేణులు నానా దుర్బాషలాడి దాడికి ప్రయత్నించటంపై టీడీపీ అధినేత చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. ఒంగోలులో భయానక పరిస్దితులు సృష్టించి టీడీపీ లబ్ధిపొందాలని చూస్తోందని విమర్శించారు. గొడవ జరిగిన ప్రాంతానికి ఏం జరిగిందో సామాన్య వ్యక్తులను అడిగి తెలుసుకోవాలి.. ఐదేళ్ల క్రితం ఒంగోలు కమ్మపాలెంలో ఇదే తరహా ఘటనకు పాల్పడి అక్రమ కేసులు పెట్టారు.. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సామాజిక వర్గానికి చెందిన ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టలేదన్నారు బాలినేని. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నా కుటుంబంపై ఇలాంటి ఘటనలకు పాల్పడటం కరెక్టేనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బాలినేని.. నన్ను టచ్ చేస్తే ఊరుకున్నా.. నా ఫ్యామిలీని టచ్ చేసినా కూడా ఊరుకోవాలా..? అని నిలదీసిన ఆయన.. రిమ్స్ లో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్తల దగ్గరకు వెళ్లి మీ సంగతి తేలుస్తామంటూ బెదిరించారు.. మా కార్యకర్తలను ఒంగోలు రిమ్స్ లో బెదిరించిన వీడియోలు కూడా స్పష్టంగా ఉన్నాయన్నారు. ఎన్నికలలో లబ్ది పొందేందుకు కావాలనే ప్లాన్ చేసి ఇలాంటి ఘటనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనపై ఎస్పీ స్పందించకపోతే ఇళ్లకు వెళ్లి కొడతామని మాజీ ఎమ్మెల్యే జనార్దన్ బెదిరిస్తున్నారు.. ఒంగోలు ఇష్యూ మీద అన్ని ఆధారాలతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం అని ప్రకటించారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.
జ్యోతిరావు ఫూలే ఆశయాలు సీఎం జగన్‌తోనే సాధ్యం..
దేశం గర్వంగా చెప్పుకునే వ్యక్తి జ్యోతిరావు ఫూలే.. ఆయన ఆశయాలు సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితోనే సాధ్యం అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అప్పిరెడ్డి.. ఈ రోజు వైసీపీ సెంట్రల్ ఆఫీస్ లో జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు.. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, గంజి చిరంజీవి, పార్టీ బీసీ నాయకులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో పూలే విధానాలు అమలు కావాలి అంటే మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ రావాలన్నారు. బీసీల అభివృద్ధి కోసం పాటుపడిన స్వతంత్ర సమరయోధుడు పూలే అని పేర్కొన్న ఆయన.. రాష్ట్రంలోని ఎంపీ, ఎమ్మెల్యే 200 స్థానాల్లో.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కలపి వంద స్థానాలు ఇచ్చిన వ్యక్తి జగన్ మాత్రమే అన్నారు. పేదలకి సంక్షేమ పథకాలతో పాటు బీసీ కార్పొరేషన్స్ ఏర్పాటు చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని ప్రశంసలు కురిపించారు. వచ్చే ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాలు వైసీపీ గెలవాలని కోరుకుంటున్నాను అన్నారు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి.
వాలంటీర్లపై తప్పుడు ప్రచారం.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైసీపీదే ఘన విజయం
ఆంధ్రప్రదేశ్‌లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. కోడ్ వచ్చిన తర్వాత ఈసీ ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి.. వైసీపీకి ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వస్తున్నాయి.. కేసులు బుక్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే మాదే విజయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక, నాలుగు అయిదు నెలల పాటు అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు చేసింది.. ఇప్పుడు అభ్యర్థుల మార్పు ఎందుకు ఉంటుంది..? అని ప్రశ్నించారు. అభ్యర్థుల మార్పు గందరగోళం అంతా టీడీపీ కూటమిలోనే ఉందన్న ఆయన.. వాళ్లను కవర్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో వైసీపీపై టీడీపీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.. నలుగురు వ్యక్తులు వచ్చరని వైసీపీలో అభ్యర్థుల మార్పు ఉండదని స్పష్టం చేశారు సజ్జల.. ఇక, చంద్రబాబు రోజుకు ఒక మాట మారుస్తారు అని దుయ్యబట్టారు సజ్జల.. చంద్రబాబు నాలుగు ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇస్తున్నారన్న ఆయన.. వాలంటీర్ వ్యవస్థపై నమ్మకం ఉంటే.. ఇన్నాళ్లు చంద్రబాబు మాట్లాడిన మాటల సంగతి ఏంటి? అని నిలదీశారు. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు తప్పుగా మాట్లాడారు.. తాము అధికారంలోకి వస్తే తీసివేస్తా అన్నారు.. ఇప్పుడు ఆ వ్యవస్థనే కొనసాగిస్తా అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తప్పిదారి అధికారంలోకి వస్తే ఇప్పడు ఉన్న వాలంటీర్లను తీసివేసి.. జన్మభూమి కమిటీ సభ్యులతో నింపుతారని ఆరోపించారు. అయితే, రాష్ట్రంలో ప్రజల తీర్పు ఇప్పటికే స్పష్టంగా ఉంది.. తిరిగి వైసీపీ అధికారంలోకి రాబోతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు.. రాజీనామా చేసిన వాలంటీర్లు ప్రచారంలో ఉంటే అడిగే హక్కు టీడీపీకి ఎక్కడి? అని నిలదీశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.
బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్‌ఎస్సే..
బలహీన వర్గాల కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీసీ బంధు, దళిత బంధు లాంటి పథకాలు పెట్టారన్నారు. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా కేసీఆర్ బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్న కేటీఆర్.. పూలే బాటలో కేసీఆర్ నడిచారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కేసీఆర్ బీసీలకు ఇచ్చారని.. పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు స్థానాలు బీసీలకు ఇచ్చారన్నారు. బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత బీఆర్ఎస్ ఇచ్చిందన్నారు.
బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలిచినా దేనికైనా సిద్ధం.. కోమటిరెడ్డి సవాల్
రాష్ట్రంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద సీనియర్ నేత జానారెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కుల, మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్ధిపొందాలని చూస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. దేశ ఐక్యతకు జరగబోయే ఎన్నికలు నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు సీఎంగా ఉంటారని.. కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో ఏకనాథ్ షిండేలు లేరని.. హస్తం పార్టీలో గ్రూపులు లేవన్నారు. అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామన్నారు. ఏకనాథ్ షిండేను సృష్టించిందే బీజేపీ పార్టీ అని ఆయన విమర్శలు గుప్పించారు. హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని హెచ్చరించారు. పనికిరాని చిట్ చాట్‌లు బంద్ చేయాలన్నారు. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే తాను దేనికైనా సిద్ధమని మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు. తమ పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దన్నారు. బండి సంజయ్‌ను ఎందుకు మార్చారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా అంటూ మంత్రి ప్రశ్నించారు.
సైనిక స్కూళ్లపై కాంగ్రెస్ ఆరోపణలు.. రాష్ట్రపతికి లేఖ
సార్వత్రిక ఎన్నికల వేళ మరో వివాదం తెరపైకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక స్కూళ్లను ప్రైవేటీకరణ చేస్తున్నారంటూ కేంద్రంపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే లేఖ రాశారు. దేశంలోని సైనిక్ స్కూళ్లను ప్రైవేటీకరించే యోచనను కేంద్రం విరమించుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రైవేటీకరణకు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలను రద్దు చేయాలని.. ఆ విధానాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఖర్గే కోరారు. రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని స్వతంత్ర సంస్థ ద్వారా దేశంలో 33 సైనిక్ స్కూళ్లు పనిచేస్తున్నాయని ఖర్గే గుర్తుచేశారు. ఇంతవరకు సైనిక దళాలు, వాటి అనుబంధ సంస్థలు రాజకీయాలకు దూరంగా ఉన్నాయని… ప్రైవేటీకరిస్తే వాటి స్వభావంపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఒక సిద్ధాంతాన్ని విద్యార్థులపై రుద్దేందుకు ప్రయత్నించడం తగదని హితవు పలికారు. దేశ సేవకు కావాల్సిన లక్షణాలను, దార్శనికతను ఈ పాఠశాలల్లోని విద్యార్థులు నిలుపుకోవాలంటే ప్రైవేటీకరణ ఒప్పందాలను పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కోరారు. లేదంటే 62% పాఠశాలల్ని బీజేపీ-ఆరెస్సెస్ నేతలే సొంతం చేసుకుంటారని ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. కాబట్టి జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రైవేటీకరణ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని.. అవగాహన ఒప్పందాలను రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
అనిల్ అంబానీకి ఎదురుదెబ్బలు.. సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు
అనిల్ అంబానీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా తన గ్రూప్‌లోని ఒక సంస్థకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో అనిల్‌కు ఊహించని ఎదురుదెబ్బతో షాక్ అయ్యారు. రూ.8,000 కోట్లు కోల్పోవల్సిన దుస్థితి ఏర్పడింది. అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్‌నకు చెందిన అనుబంధ సంస్థ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ రూ.8,000 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదంటూ తాజాగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. దీంతో అనిల్ అంబానీకి గట్టి షాక్ తగిలినట్టైంది. 2008లో ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో ఉన్న అనిల్.. ప్రస్తుతం ఆ జాబితాలోనే కనిపించకుండా పోయారు. కొన్నేళ్లుగా ఆర్థికంగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు మరింత షాకిచ్చినట్లైంది.
మేం బరిలో ఉన్నప్పుడు.. ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదు! శుభ్‌మన్ గిల్ కౌంటర్
ఎలాంటి లక్ష్యమైనా చివరి వరకూ పోరాడటం తమ జట్టు లక్షణమని, ప్రత్యర్థులెవరూ తమను ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హెచ్చరించాడు. రషీద్ ఖాన్ అద్భుతమైన ప్లేయర్ అని, అతడి లాంటి క్రికెటర్ ఉండాలని ప్రతి జట్టూ కోరుకుంటుందన్నాడు. చివరి బంతికి గెలవడం ఎప్పుడూ గొప్ప అనుభూతి అని గిల్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా బుధవారం చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై గుజరాత్ గెలిచింది. శుభ్‌మన్ గిల్ (72), సాయి సుదర్శన్ (35), రషీద్ ఖాన్ (24 ), రాహుల్ తెవాతియా (22) గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్ అనంతరం కామెంటేటర్ హర్షా భోగ్లే వ్యాఖ్యలకు శుభ్‌మన్ గిల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘చాలా బాగా ఆడారు. గుజరాత్ టైటాన్స్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. విజయం సాధించినందుకు అభినందనలు. అయితే ఇంకాస్త ముందుగానే గెలవాల్సిన మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్తారని కొందరు అంటున్నారు’ అని హర్షా భోగ్లే అనగా.. ‘ధన్యవాదాలు. మేం బరిలో ఉన్నప్పుడు ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదని గుర్తుంచుకోవాలి. ఎలాంటి లక్ష్యమైనా చివరి వరకూ పోరాడటం జట్టు లక్షణం’ అని గిల్ కౌంటర్ వేశాడు.
వార్ 2 షూటింగ్ షురూ.. ఎన్టీఆర్ 10 రోజులు అక్కడే..!
ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో బిజీగా ఉంటున్నాడు.. కొరటాల శివ దర్శకత్వం లో తెరకేక్కుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా అక్టోబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో విడుదల కాబోతుంది.. ఇప్పుడు వార్ 2 షూటింగ్ మొదలుకాబోతుందని తెలుస్తుంది.. ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నాడు.. ఈ సినిమా గురించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.. అందుతున్న సమాచారం ప్రకారం.. రేపటి నుంచి ఎన్టీఆర్ ఈ షూటింగ్ లో పాల్గొననున్నారు.. ముంబైలోని YRF (యష్ రాజ్ ఫిలిమ్స్) స్టూడియోలో 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగబోతుంది. ఇందులో హృతిక్ రోషన్- ఎన్టీఆర్ మధ్య కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట..
ఆల్‌టైమ్ హిట్ పాటకు రాజమౌళి, రమ డ్యాన్స్.. రిహార్సల్ వీడియో వైరల్!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇటీవల ఓ వివాహ వేడుకలో పాల్గొని తన సతీమణి రమతో డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. హీరో, డాన్స్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ఆల్‌టైమ్ హిట్స్‌లలో ఒకటైన ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే.. సత్తురేకు కూడా స్వర్ణమేలే’ పాటకు వీరిద్దరూ స్టెప్పులేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. రాజమౌళిలో ఈ టాలెంట్ కూడా ఉందా? అని అందరూ ఆశ్చర్యపోయారు. తాజాగా ఆ డాన్స్‌కు సంబంధించిన రిహార్సల్ వీడియో వైరల్‌గా మారింది. ‘అందమైన ప్రేమరాణి చెయ్యి తలిగితే..’ పాటకు ఎస్ఎస్ రాజమౌళి, రమలు డాన్స్ కొరియోగ్రాఫర్ సమక్షంలో రిహార్సల్ చేశారు. రాజమౌళి దంపతులతో పాటు మరికొందరు కూడా రిహార్సల్ చేశారు. అయితే అందరిలోకెల్లా దర్శకధీరుడి స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రాజమౌళి, రమ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న క్లిప్‌ను చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అదే సమయంలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి మామూలోడు కాదు అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సీఈవో, నిర్మాత చెర్రీ కుమార్తె వివాహంలో రాజమౌళి దంపతులు డాన్స్ చేసినట్లు తెలుస్తోంది.